ప్రభా గొర్రెల కాపరి పిలవడంతో గొర్రె కి నాటు వైద్యం చేసిన వ్యక్తి నీ చూసి ఈ కాలంలో కూడా నాటు వైద్యం బతికి ఉన్నట్టే గ్రీటే అని గోవిందతో చెబుతూ పదం వెళ్దాం నీకు బాగా ఆకలిగా ఉందేమో" అని మాట్లాడుకుని ప్రభా గోవిందులు ఇద్దరు హోటల్ కి వెళ్లి లంచ్ చేసి ఫామ్ హౌస్ కి రాగా గోవిందు రూమ్ కి వెళతాడు. ప్రభ ఫామ్ హౌస్ కి ఇంటి ముందు ఆరు బయట కుర్చీలో అటు తిరిగి కూర్చున్న వ్యక్తిని కాస్త దగ్గరకెళ్ళి చూసి "నమస్తే అండి" అన్నాడు ప్రభ." ఆ నమస్తే" అంటూ అతను ఇటు తిరగడంతో "అరే! అక్కడ గొర్రెకి నాటువైద్యం చేసిన వ్యక్తి .అంటే ఇతనే పెద్దాయన నా అంచనా కరెక్ట్ అయింది అనుకున్నాడు మనసులో ప్రభ. "ట్రైనింగ్ కోసం వచ్చింది మీరేనా?"అడిగాడు పెద్దాయన. "అవునండి" అంటూ తలపాడు ప్రభ. ఇక్కడ సౌకర్యంగానే ఉందా?మరొక్కసారి ప్రశ్నించాడు పెద్దాయన. ఆ,చాలా బాగుందండి