ప్రణయ గీతిక - 6

ట్రైనింగ్ ముగించి వచ్చిన ప్రభ అమ్మకు తాను కూడా సాయం చేయాలని ఆలోచించి ఏదైనా పని చూసుకోవాలని అనుకొని గోవిందుతోపాటు అలా టౌన్ కి వెళ్లి బైక్ రేస్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లేసరికి "నైనా "అనే అమ్మాయి తనకు వస్తానని చెప్పిన రైడర్ రాకపోవడంతో ప్రభని అడగగా తనకు రైడింగ్ చేయడం ఇష్టం కాబట్టి ఒప్పుకొని బైక్ రైడింగ్ లో మొదటి స్థానంలో నిలిచి ఆమె ఇచ్చిన కొంత అమౌంట్ తీసుకొని వచ్చి అమ్మకి ఇవ్వబోగా" ఇది ఎక్కడిది "అని అడిగేసరికి తడబడుతూ"   బై "బైక్ రేస్ కి వెళ్ళాను "అని చెప్పడంతో చంపచళ్ళు మనిపించింది గౌరీ. అమ్మ ఎందుకు కొట్టిందో అర్థం కాక ప్రభ మరి మాట్లాడకుండా డబ్బుని ఆమె ముట్టుకోకపోవడం తో తన గదికి వెళతాడు.అమ్మ నన్ను ఎందుకు కొట్టిందో!  నాకు బైక్ రైడింగ్ ఇష్టమని వెళ్లాను కానీ చిన్నప్పటి నుంచి నన్ను ఏ రోజు ఒక్క దెబ్బ కూడా