ప్రణయ గీతిక - 7

  • 360
  • 126

గుణేష్ ని   అతని రూమ్ కి వదిలి వచ్చిన ప్రభ అర్జునుని ఏదో అడగాలని అనుకుంటూ ఉండగా అర్జున్ ఇవాళ ఉదయం తొందరగా వెళ్ళాలి అని చెప్పి ముందుగానే వెళ్ళిపోయేసరికి అడగలేక పోతాడు ప్రభ.  ఉదయం  ఆఫీస్ లోకి అడుగుపెడుతుండగా  అప్పటికే గుణేష్ ఒక అమ్మాయిని తిడుతూ కనిపించాడు  .  భయం భక్తి  లేకుండా పనిచేస్తావా ఏంటి?  ఇంత చిన్న వయసుకే వచ్చి ఇలాంటి చెత్త పనా  చేసేది చదువుకోమని కాలేజ్ పంపితే ఇలా అవతారాలు చేస్తుంటారు కాబట్టి వాళ్లు మిమ్మల్ని ఇలా పనికి పంపించి ఉంటారు అన్నాడు గుణేష్.ఆ అమ్మాయి ఏడుస్తూ" సార్ !  నేను ఏ తప్పు చేయలేదు  అతనికి పనిలో హెల్ప్ చేయలేదని నన్నిలా ఇరికించాడు నాకు చదువుకోవాలని చాలా ఇష్టం అయినా మేము ఐదు మంది అమ్మాయిలు నేనే పెద్దదాన్ని మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది కాబట్టి కుటుంబం బాధ్యత నా మీద పడింది అందుకే