వెంటాడే నీడలు - 18

  • 267
  • 63

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "తను పద్దెనిమిది సంవత్సరాలకి దగ్గర పడుతూండగా. తన కళ్ళల్లో మెరుపులు చూపించడం, తనవైపు లాక్కోవడం లాంటిద్వారా తాను ఆమెని ఇష్టపడుతున్నాడని తెలియచేస్తాడు. అయితే అప్పటివరకూ ఆమె పురుష సంగమం లేకుండా ఉండాలి." "అందుకు కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ కబుసా తప్పకుండా నన్ను ఎన్నుకుంటాడన్న నమ్మకం నాకుంది." అదే ధృడత్వంతో అంది మల్లిక. "నీకు ఒక మంచి మనిషిని ఇచ్చి పెళ్ళిచెయ్యాలని నీ మామ్మ ఆలోచిస్తూంది. నీ నాన్న కూడా అదే ఆలోచనతో వుండివుంటాడు. ఎవడూ తన భార్య కబుసా కోరినట్టుగా ఉండడానికి ఒప్పుకోడు. నువ్వు కబుసా గురించి ఆలోచించడం మానెయ్. " సింహరాజు అన్నాడు. "సరేలే, ఇప్పుడేం నేను కబుసా ని పూజించడం మొదలుపెట్టలేదు కదా." మల్లిక అంది. "కానీ కబుసా నన్ను ఎన్నకోవడం జరిగితే,