అరణ్యకి ఎమ్మార్వో జాబ్ వచ్చిందని చాలా సంతోషిస్తాడు పెద్దాయన. పెద్దాయన " అరణ్య మొదటి రోజు కదిరినాడుకు వెళ్లేటప్పుడు తోడుగా నువ్వు కూడా వెళ్ళమని" ప్రభ కి చెప్పడంతో అలాగే అని చెప్పి వెళతాడు ప్రభ.ప్రభా రామాపురం నుంచి వస్తుoటే బసవయ్య మాటలే గుర్తుకు వస్తున్నాయి "ఏంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడినంత మాత్రాన అలా మాట్లాడతాడా ? ఈ సమాజంలో ఆడ ,మగా మాట్లాడితేనే ఇలాంటి మాటలు అంటగడతారు. ఎప్పుడు మారుతుందో ఈ సమాజం అని నేను అనుకున్నా సమాజం ఏం చేయగలదు ..అందులో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోని వాళ్ళు కూడా ఉంటారు ఇలా బసవయ్యలా, అయినా ఎవరేమనుకుంటే మాకేంటి మాకు నచ్చినట్టు మేము బతకాలి అప్పుడే మరణించే వరకు కాస్త ఆనందంగానైనా ఉన్నట్టు అవుతుంది" అని ఆలోచించుకుంటూ బండిని రైడ్ చేస్తూ ఉండగా జనాలు గుమిగూడి ఉండడం చూసిన ప్రభ దూరంగా అలా వెళుతూ ఎవరినో అడిగేసరికి