నైవేద్యం

  • 228
  • 81

కార్తీకమాసం ఆరంభమైన తొలి సోమవారం. పల్లె చివరనున్న చిన్న శివాలయం వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ప్రతి ఒక్కరూ తమ కోరికలు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పూలు, పండ్లు సమర్పిస్తున్నారు. ఆ గుంపులో రామయ్య అనే వృద్ధుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో పూల బుట్ట లేదు, కొబ్బరికాయ లేదు, ఖరీదైన నైవేద్యం లేదు. చిన్న నూనె సీసా, పత్తితో చేసిన రెండు వత్తులు మాత్రమే ఉన్నాయి.ఆలయ అర్చకుడు చిరునవ్వుతో, “రామయ్యా! ఈరోజు కూడా అదే తెచ్చావా?” అని అడిగాడు.రామయ్య వినయంగా, “స్వామీ! నా స్థోమత ఇంతే. దేవుడి ముందు వెలిగించే దీపమే నా మహా సమర్పణ. వెలుగు ఉన్న చోట చీకటి నిలవదు కదా!” అని అన్నాడు.అతని మాటలు విన్న కొందరు చిరునవ్వు నవ్వినా, అర్చకుడు మాత్రం గౌరవంగా తల ఊపాడు.ప్రతిроజూ ఉదయం, సాయంత్రం రామయ్య ఆ రెండు దీపాలను వెలిగించి కొద్ది సేపు నిశ్శబ్దంగా కూర్చునేవాడు.