వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "అలా ఎలా చేసానో నాకు అర్ధం కావడం లేదు. అదృష్టం బావుంది వాళ్ళెవరూ చనిపోలేదు. చనిపోయుంటే ఏమైవుండేది?" ఆందోళనగా అంది సారిక. ఆ సమయం లో సారిక, ప్రదీప్ ఆమె రూమ్ లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు. "వాళ్ళు నిన్ను నిస్సహాయురాలిని చేసి, గ్యాంగ్ రేప్ చెయ్యబోతూవుంటే ప్రతిఘటించావు. ఒకవేళ వాళ్లెవరన్నా చనిపోయివున్నానీకేమయి ఉండేది కాదు." నవ్వాడు ప్రదీప్. "రాస్కెల్స్. ఎంతకి తెగించారు? నువ్వు తగిన శాస్తి చేసావు వాళ్ళకి. ఇంక నీకే కాదు, ఏ అమ్మాయికి ఆలా చెయ్యడానికి సాహసించరు వాళ్ళు." "ఆ గ్యాంగ్ రేప్ తప్పదనే అనుకున్నాను. దానికి మానసికంగా సిద్ధపడిపోయాను. కానీ సడన్ గా నాకు అంత శక్తి ఎలా వచ్చిందో బోధపడడం లేదు." కాస్త ఆగాక మళ్ళీ అంది సారిక. "సందేహం లేదు. ఏ