వెంటాడే నీడలు - 23

  • 429
  • 198

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఈ సమయం లో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా?" వెనకనుండి ఆ గొంతువిని చటుక్కున వెనక్కి తిరిగింది సారిక. వెనగ్గా నిలబడ్డ మాలతి సారిక మోహంలో ద్వేషం, కోపం చూసి ఆశ్చర్యపోయింది. ఆ రోజు తనని చంపబోయినప్పుడు కూడా తను సారిక మోహంలో ఇలాంటి ద్వేషం, కోపమే చూసింది. "అసలు నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు?" ఆలా అంటూ వేగంగా మాలతి వైపు నడిచింది సారిక. ఆ రోజు అనుభవం గుర్తువుండడం వల్ల క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వేగంగా అక్కడనుండి పరిగెత్తింది మాలతి. "నన్నేం చెయ్యకు తల్లీ, నన్నేం చెయ్యకు" తన వెనకాలే తన రూమ్ లోకి వచ్చిన సారికకు రెండు చేతులూ అడ్డుపెడుతూ అంది మాలతి. "నేను నిన్నేం చేస్తాను మామ్. ఎందుకు ఆలా భయపడుతున్నావ్?" తన తల్లిని