తొలి పౌర్ణమి - 6

  • 639
  • 222

విషయం తెలిసిన సూర్య అక్కడికి వచ్చాడు, సూర్య మీదకి ఆవేశంగా వెళ్ళాడు రమణ. “నీ కొడుకుని రెచ్చగొట్టి పంపించి నా కొడుకుని చంపావు కదరా!!” అంటూ చొక్కా పట్టుకున్నాడు. అది కాదు రమణ అదేదో పొరపాటున జరిగిపోయింది ఎవరైనా కావాలని ఇలాంటి పనులు చేస్తారా చెప్పు..ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నీ కొడుకుని సమర్థించుకుంటున్నావ్…, నీకు కొంచెం కూడా బాధగా లేదా, అంటూ కాలర్ పట్టుకున్నాడు రమణ..మాటకు మాట పెరిగి గొడవ పెద్దదవుతోంది చుట్టుపక్కల వాళ్లంతా ఇది సమయం కాదు అంటూ సర్ది చెప్పి సూర్యను ఇంటికి పంపారు. విక్రమ్ నాన్నతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు, అలా వెళ్తున్నప్పుడు హేమ మళ్ళీ ఇంకొక చూపు చూసింది, ఆరోజు కృతజ్ఞతగా చూస్తే, ఈరోజు అసహ్యంగా చూసింది, విక్రమ్ తల వంచుకుని వెళ్ళిపోయాడు. రమణ కుటుంబం మొత్తం ఒక అంబులెన్స్ ను సిద్ధం చేసి సొంతవూరుకు బయలుదేరారు … విక్రమ్ ను ఇంట్లోకి తీసుకెళ్లాడు సూర్య.. విక్రమ్ మౌనంగా ఒక