చాందిని ముందే నిద్రలేచి“ఒసేయ్ శృతి ఈరోజన్నా త్వరగా లెగవే..”.ఇంకాసేపు చందు.“నువ్వు ఇలా వినవు” అంటూ, బాత్రూం రూమ్ లో నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చి శృతి మీద గుమ్మరించింది..“ఓరి దేవుడా…” అంటూ లేచింది శృతి.ఏంటి చాందిని ఇలా చేసావ్.నిన్ను ఇలాగే వదిలేస్తే ఈరోజు కూడా పదింటి దాకా ఇక్కడే ఉంటాం, అసలే ఈరోజు హెచ్.ఆర్ ని కలవాలి..అవును చాందినీ..మర్చిపోయా మెయిల్ వచ్చింది కదా..మరి ఇంకా కూర్చున్నావే పదా.. ****హలో మేఘన..హాయ్ గర్ల్స్, ఐయామ్ సారీ మీ పేర్లు గుర్తు లేవు.పర్వాలేదు మేఘన,.. నా పేరు చాందిని, మాకు ప్రాజెక్టు అలొకేషన్ మెయిల్ వచ్చింది.ఓ దట్స్ గుడ్, లెట్ మి సీ, అంటూ లాప్టాప్ లో ఏదో చెక్ చేసింది, ఓకే ,ఇక్కడ థర్డ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ లో మీ ప్రాజెక్ట్ ఓ.డి.సి ఉంటుంది, అక్కడ మీ ప్రాజెక్ట్ లో ఇద్దరు సీనియర్స్ ఉంటారు వాళ్ళని కలవండి, మీకు