ఆరోజు బుధవారం నేను మా అమ్మ నాన్నలతో కలిసి తిరిగి బెంగళూరుకు బయలుదేరాను. ఎందుకో తెలియదు కానీ తనని మళ్ళీ చూడాలనిపిస్తోంది. జయ నిన్న ఫోన్ చేశాడు మా జాయినింగ్ ఆలస్యమై సోమవారానికి చేరుకుందట. ఎలాగో టైమ్ ఉంది కాబట్టి తనని వెతుకుదామని ముందే బయలుదేరా. పొద్దున్నే 8:00 కి బస్సు ఎక్కితే సాయంకాలం కల్లా బెంగళూరులో ఉన్నాం. జయా కి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను, ఏడింటి కల్లా వచ్చాడు, ఇద్దరం మేడ పైకి వెళ్ళాం. వాడికి ఈ విషయం ఎలా చెప్పాలా అని మౌనంగా ఆలోచిస్తున్నా..“ ఏంట్రా అర్జెంట్ గా రమ్మని పిలిచావ్ “ అని వాడే మొదలు పెట్టాడు.ఊళ్లో నాకు పెళ్ళి చూపులు జరిగాయి రా..కాంగ్రజులేషన్స్ మావ..అంత తొందరొద్దు, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు.ఎందుకు?.. వేరే ఎవరన్నా నచ్చారా..రేయ్ నీకు… తను తెలుసు గా..తనంటే ఎవర్రా మన పాత కంపెనీ లో ఉన్న షీలా నా, చాలా బాగుంటుంది కదా. ఒరేయ్ కామాంధుడా తను