ప్రేమ్ ఊర్మిళాదేవి చెయ్యి పట్టుకుని కిందకు నడుస్తూ " అమ్మమ్మ ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలి అంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇదంతా కూడా నాకు ఏదో కల లాగా అనిపిస్తుంది" అని అంటాడు. " నాకు కూడా మనవడా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నా కూతురు నా దగ్గరికి వచ్చింది, ఆయనే కనక బ్రతికి ఉండి ఉంటే ఎంతో సంతోషపడేవారు , ఈరోజు కోసం ఆయన చివరి శ్వాస వదిలే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు " అని అంది ఊర్మిళాదేవి. ఆవిడ గొంతులో బాధ కంటిలో నీటి చెమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ బాధపడుతుంది అని గమనించిన ప్రేమ్ ఊర్మిళాదేవి గారిని హత్తుకుంటూ " అమ్మమ్మ ఇలాంటి సమయంలో ఎవరైనా బాధపడతారా , తాతయ్య ఎక్కడున్నా సరే చాలా సంతోషపడతారు నువ్వు ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉంటే ఆయన