తొలి పౌర్ణమి - 14

జయ బయటికెళ్లాడు.చాందిని సడన్గా లేచి నా వైపు వచ్చింది. ఏంటి చాందిని ఏదన్నా డౌటా అని అడిగా.  నటించకు విక్రమ్, నువ్వు పొద్దున్నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు అన్న విషయం నాకు తెలుసు.నేను కాసేపు మౌనంగా ఉండి, “చాందిని, నన్ను పెళ్లి చేసుకుంటావా..” అని అడిగా.“ఆరోజు శృతి అలా ఎందుకు అడిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది”, అయినా మీకు ఉన్నట్టుండి ఎందుకిలా ప్రేమ పుట్టుకొస్తుంది.., మేము ఫ్రెషర్స్ అని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా..నువ్వు ఎలా బడితే అలా మాట్లాడొద్దు, నువ్వు నాకు పరిచయమైనప్పటినుంచి ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా.., నేను టైమ్ పాస్ కి లవ్ అనట్లేదు, పెళ్లి చేసుకుందాం అంటున్నా..నాకు ఈ ప్రేమ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, నన్ను వదిలేయ్..ఐతే ఇన్ని రోజులు మన మధ్య జరిగిందంతా ఏంటి, అంటూ తన కళ్ళలోకి కి సూటిగా చూసా..మనమంతా ఒకే టీం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అని నువ్వే చెప్పావ్ గా, అందుకే