వాట్ ఈజ్ దిస్ చాందిని నువ్వు ఇంత లేట్ చేస్తే నేను దీన్ని మేనేజ్ చేయలేను.” It is showing your incapability in the work..”.నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తా సోహమ్, అంది తను.ఈరోజు సాయంత్రం ఎంత లేట్ అయినా సరే దీన్ని పూర్తి చేసి వెళ్ళాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అంటూ వెళ్లిపోయాడు. ఈ సోహమ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు అన్ని టాస్కులు అసైన్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లే, పోనీ సోహమ్ కి చెబుదాం అంటే మేం క్లైంట్ లొకేషన్ కి వచ్చాం వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు..తను చాలా టెన్షన్ పడుతోంది..నాకు తను భయపడటం నచ్చలేదు, తనకు హెల్ప్ చేద్దామని నిర్ణయించుకున్నా. తన పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలోకి కూర్చున్నాను, తనని అడక్కుండానే లాప్టాప్ తీసుకున్నాను, ఇష్యూ ఏంటో చూడటం మొదలుపెట్టా, దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు అరగంట పట్టింది.తర్వాత తనకు వాటిని