పైకి లేచి విక్రమ్ వైపు నడవడం మొదలుపెట్టాను… ఒక్కో అడుగు భారంగా ముందుకు కదిలింది, కళ్ల ముందు అన్నీ మసకబారుతున్నాయి…“విక్రమ్…” అనే మాట పెదవుల పైకి రావడం కష్టంగా మారింది. అడుగులు కొంచెం తడబడ్డాయి. నా శరీరం సహకరించట్లేదు…, మూడో అడుగు వెయ్యగానే పడిపోయాను.“చాందినీ!” అంటూ శృతి పరుగెత్తుకొచ్చింది.నా పక్కన మోకాళ్లపై కూర్చుంది.అసలు ఏమైందే నీకు..నా గొంతు బలహీనంగా…, “స్లీపింగ్ పిల్స్… తీసుకున్నా, శృతి…”“నీకేమన్నా పిచ్చి పట్టిందా?!” అని అరిచింది శృతి.కళ్లపై నల్లటి తెర కమ్ముకుంటూ, శ్వాస మందగించింది.శృతి నా చేతిని పట్టుకొని,“చాందినీ… ఏంటి పిచ్చిపని!” అని కన్నీళ్లు కార్చింది."శృతి… నాకు ఇప్పుడు చావాలని లేదు…” అన్నా..నా కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు.., అంతే తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు.. *******కళ్ళు తెరవగానే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా.., కానీ నా చుట్టూ ఎవరు లేరు, ఇదేదో ICU లా ఉంది..నాకు తగిలించిన సెలైన్