త్రిమూర్తి - 2

  • 288
  • 108

“ఏమైంది రమ్యా?”ఆమె పరిస్థితి చూసి అతని గుండె ఆగినంత పని అయింది.ఇల్లు రక్తంతో తడిసిపోయింది.“బావా!”రమ్య కేక వేసింది.కేశవ వెంటనే బయటికి పరుగెత్తి ఆటో ఆపాడు.ఆమెను ఎత్తుకుని ఆటోలోకి తీసుకెళ్లాడు.హాస్పిటల్రమ్యను అత్యవసరంగా ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.కేశవ బయట ఆందోళనగా తిరుగుతున్నాడు.కొంతసేపటి తర్వాత...లోపల నుంచి శిశువు ఏడుపు వినిపించింది.కేశవ ముఖంలో ఆనందం.“పిల్లాడు పుట్టాడు!”డాక్టర్లు మాత్రం ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు.ఏదో అర్థంకాని విషయం జరిగింది.కానీ ఎవరికీ సమాధానం లేదు.కొద్దిసేపటికి రమ్యకు బిడ్డను చూపించారు.ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.కేశవ తన కొడుకు చిన్న చేతిని పట్టుకున్నాడు.“రా నాన్న... నీ అమ్మని కొడదామా?”అతను తన వేలిని బిడ్డ చేతిలో పెట్టాడు.బిడ్డ అతని వేలిని పట్టుకోలేదు.అమ్మ వైపు చూసాడు.కేశవ నవ్వాడు.“వామ్మో! అప్పుడే అమ్మ వైపు వెళ్లిపోయావా?”పక్కనే ఉన్న డాక్టర్ సౌమ్య చిరునవ్వుతో చెప్పింది.“పిల్లాడు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. బాగా స్పందిస్తున్నాడు. ఏదైనా జ్వరం లేదా ఆరోగ్య సమస్య కనిపిస్తే వెంటనే నా దగ్గరికి తీసుకురండి.”ఆమె ఒక కార్డు ఇచ్చింది.“ఇది VIP