క్షుద్ర

  • 99

క్షుద్రఅధ్యాయం 1 — అగ్నిలో మొదలైన మేల్కొలుపుఅగ్నిపర్వతం గుండెలో...అక్కడ పగలు లేదు.రాత్రి లేదు.చీకటి లేదు.ఎటు చూసినా భగభగ మండుతున్న లావా మాత్రమే.భూమి అంతర్భాగంలో ఉప్పొంగుతున్న అగ్ని ఎర్రటి సముద్రంలా కదులుతోంది. వేడి తట్టుకోలేక రాళ్లు పగిలిపోతున్నాయి. ఆ వేడికి గాలి కూడా వణుకుతున్నట్టుగా అనిపిస్తోంది.కానీ ఆ అగ్ని మధ్యలో...ఒక మనిషి కూర్చున్నాడు.పద్మాసనంలో.కళ్లను మూసుకుని.చుట్టూ ఉన్న లావా అతని శరీరాన్ని తాకుతూ ప్రవహిస్తోంది. తల మీద పడుతోంది. భుజాల మీదుగా జారుతోంది. ఛాతీని తడుపుతోంది.అయినా అతని శరీరానికి ఏమీ కావడం లేదు.కాలిపోవడం లేదు.భయపడటం లేదు.అతని పెదవుల నుంచి ఒక్క మంత్రమే నిరంతరం బయటకు వస్తోంది.“ఓం వారాహి మాత...”కొద్దిసేపటి తర్వాత...అతని శ్వాస మారింది.మంత్రోచ్ఛారణ మరింత గంభీరంగా మారింది.“ఓం వారాహి మాత...”అతని శరీరంపై ఉన్న రుద్రాక్షలు ఒక్కొక్కటిగా వెలుగులు విరజిమ్మాయి.చేతులపై...మణికట్టులపై...కాళ్లకు...నడుముకు...మెడ చుట్టూ...ప్రతి రుద్రాక్షలోనూ ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్టుగా నీలం, ఎరుపు రంగుల కాంతి మెరుస్తోంది.అతను మెల్లగా కళ్లను తెరవడానికి ప్రయత్నించాడు.కళ్లు కొద్దిగా తెరుచుకున్నాయి.అంతే.ఏదో అదృశ్యమైన