త్రిమూర్తి - 4

  • 468
  • 186

అధ్యాయం – 2ఇది అర్థం కాని ప్రేమస్కూల్ గేటు దగ్గర పిల్లల సందడి మొదలైపోయింది.శివ స్కూల్ లోపలికి వెళ్లబోతుండగా, ఒక్కసారిగా చుట్టూ ఉన్న అమ్మాయిల గుంపు అతని చుట్టూ చేరింది.“ఏంట్రా శివా! ఈరోజు మీ నాన్న వచ్చినట్టున్నాడు. కానీ లోపలికి ఎందుకు రాలేదు?” అని ఒక అమ్మాయి అడిగింది.“అవునురా… ఈరోజు టిఫిన్ ఏంటి?” అని ఇంకొకరు అడిగింది.మూడో అమ్మాయి ముఖం చిట్లించింది.“మా అమ్మ ఈరోజు పచ్చి కూరగాయలు చేసింది. అవి తినాలంటేనే వాంతి వచ్చేలా ఉంది. మీ అమ్మ ఏమైనా రుచికరంగా చేసిందా?”శివ నవ్వుతూ,“మా అమ్మ బిర్యానీ చేసినా మీకు ఇవ్వదు.”అన్నాడు.అంతలో ఐదుగురు అమ్మాయిలు శివ చుట్టూ నిలబడి అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు.వాళ్ల వెనకాలే నిలబడి ఉన్న డాలి మాత్రం ఆ దృశ్యాన్ని చూసి బుసలు కొట్టింది.ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది.ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పుకుని ముందుకు నడవసాగింది.శివ అందరికీ ఒక్కొక్కరికి షేక్‌హ్యాండ్ ఇస్తూ,“సరే సరే... మనం క్లాస్‌లోకి వెళ్దాం. ఇంటర్లో