సురేష్ (వీడొ పెద్ద ధూలేష్)

  • 177
  • 54

మన జీవితంలో స్నేహితుల్లో కానీ... బంధువుల్లో కానీ...మనకి ఎప్పుడో ఒకప్పుడు ఒక ధూలగాడు తగులుతూనే ఉంటాడు.ధూలగాడు అంటే...ఏదో ఒకటి చేద్దామని పెద్ద పోటుగాడిలా ప్రయత్నిస్తాడు.కాని అది చివరికి బెడిసికొడుతుంది.తన్నులు తినేది వాడొక్కడే అనుకుంటే పొరపాటే...వాడి పక్కన ఉన్నవాడికి కూడా తన్నులు పడేలా చేస్తాడు.అలాంటి ధూలేషుల్లో ఒకడే...మన సురేష్.ఇది వాడి కథె.వాడి ధూలేషాలేంటో తెలుసుకుందాం పదండి...───సాధారణంగా ఏ మనిషికైనా కౌమార దశ వచ్చాక బుర్ర దొలవడం మొదలవుతుంది.కానీ...మన సురేష్‌కి మాత్రం ఆ దొలుపు by birth నుంచే మొదలైంది.ఏంటి?నమ్మడం లేదా?అయితే... వాడి చిన్నతనంలొ జరిగిన సంఘటన ఒకటి చెప్తా...అది 1990 నవంబర్.అప్పుడు మన సురేష్‌గాడికి రెండేళ్లు.వాళ్ల అమ్మ ఆరు నెలల గర్భవతి.గర్భంతో ఉన్న వాళ్ళ అమ్మకి ఇబ్బంది కాకూడదని, మన సురేష్‌గాడిని వాళ్ల అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఊరికి తమతో పాటు తీసుకెళ్లారు.మొదట్లో మనవడు చేసే పనులు చూసి ఆ ముసలి వాళ్లు తెగ మురిసిపోయారు.“మనవడు ఎంత ముద్దుగా ఉన్నాడో!”అని.కానీ...15 రోజులు గడిచేసరికి...అదే