అరణ్య మీటింగ్ ఉందని ఆఫీస్ నుండి సచివాలయం కి, అక్కడి నుండి గెస్ట్ హౌస్ కి వెళ్లి ఎమ్ .డి. వో, M.E.O, A. E. O లు కూర్చుని ఉండగా తనూ వెళ్లి కూర్చుంది. కాసేపు నిశ్శబ్దం. ఇంతకీ మీటింగ్ ఎందుకు జరుగుతుందో అర్థం కాక అరణ్య ఎం.ఈ.ఓ వైపు చూసి అడుగుదామనుకుంటుండగా ఒక వ్యక్తి లోపలికి వచ్చి మా అయ్యగారు వస్తున్నారు అని చెప్పి పక్కకు నిలబడగా చూస్తే ఒక మీడియం ఎత్తు ఉన్న ఒక నల్లని ఆకారం ముందుకొస్తున్నట్లు అనిపిస్తోంది. తీరా మనిషి దగ్గరికి రావడంతో కళ్ళ లో కనుగుడ్డు, అతను నవ్వగా పళ్ళు మాత్రమే తెల్లగా కనిపిస్తున్నాయి. ఇంకా అతని కాలికి వేసిన బంగారు రంగు షూస్ మెరుస్తున్నాయి . అతను ఇంకాస్త దగ్గరికి వచ్చేసరికి జడుసుకున్నారు ఆఫీసర్లు. పచ్చి రాగానే నమస్తే ఆఫీసర్స్ అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించడంతో ఐదుగురు లేచి తాము చేతులు