ప్రణయ గీతిక - 24

శ్రీహరి నుండి రక్షించిన ప్రభ గీతికతో బండి యొక్క మంట ఎక్కనని తల తిప్పుతూ ఉండగాఒక్క క్షణం ప్రభ ఏమి మాట్లాడక ఆమె వైపే చూస్తూ  "ఏంటి రావా ఇక్కడే చావాలని ఉందా?" అన్నాడు. అవును, చచ్చిపోతే బాగుండేది అంది అరుస్తూ గీతిక. హలో ! చచ్చిపోయి ఉంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అంజలి ఘటించి , మూడు దోసెళ్ల మట్టి వేసి కప్పేసే వాళ్ళు . కానీ జరగరానిదేదైనా జరిగి ఉంటే జీవితాంతం చస్తూ బతకాల్సి వచ్చేది అది అర్థం చేసుకో. " ఆనాడు ప్రభ.  నేను అర్థం చేసుకోను.  ఈ భూమి మీద అందరూ మోసగాళ్లే ! ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు నన్ను వదిలేయ్ నేనే వెళ్తాను. అరే! ఇలాంటి పరిస్థితిలో కూడా ఇలా మాట్లాడతావేంటి? ముందు బండి ఎక్కు అంటూ బండిమీద కూర్చోగా ఆమె ఎక్కకుండా మెల్లగా అడుగులు వేస్తూ మరోవైపుకు వెళుతున్న గీతికను చూసి నీకు ఇష్టం