ప్రణయ గీతిక - 25

  • 1.8k
  • 699

నారాయణ గీతికను చూసి  వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు డల్ గా ఉన్నావ్ ? కళ్ళు చూడు వాసిపోయి ఉన్నాయి. ఇంతకీ నిన్న ఎక్కడికి వెళ్లావు ? అన్న ప్రశ్న నాన్న నోటి నుంచి వస్తూనే గీతికకి గుండె వేగంగా కొట్టుకో సాగింది. వెంటనే జేజి కల్పించుకొని 'తను శృతిని మాట్లాడించాలని వెళ్ళింది.' అని చెప్పడంతో  " అమ్మ!  .".అని చేతిని అడ్డంగా పెట్టడంతో వెనక్కి అడుగు వేసింది జేజి. గీతిక నేల వైపు చూస్తుండగా ,నారాయణ  'ఎందుకు నేల వైపు చూస్తున్నావ్.? శృతి ఇంటికి వెళితే చీకటి పడితే అక్కడే ఉండాలి కదా లేదా ఉదయమే వెళ్లి రావచ్చు కదా. " అని నారాయణ అంటుంటే "నాన్న అది.." అని  తడబడుతున్న గీతికను చూసి  "ఏంటి అది ఇది అంటూ  నీళ్లు నమల్తున్నావు.  నీకు ఇష్టం వచ్చినపుడు వస్తే అడిగేవాళ్ళు లేరు అనుకున్నావా, లేదా ఈ ముసలోళ్లంటే నీకు లెక్క లేదా