ప్రణయ గీతిక - 26

  • 1.6k
  • 630

ఇంటికి వచ్చినఇంటికి వచ్చిన కృష్ణ మురళి బయటకి వెళ్లి లైన్ మాన్ ని అడగడంతో"ఇక్కడ ఎవరో వ్యక్తి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని ..అందుకే కరెంట్ ఆఫ్ చేసేసి వస్తున్నాను. అని చెప్పగా కృష్ణ కూడా చూద్దామని అటు వెళ్లడంతో బోర్లా పడి ఉన్న ఆరడుగుల ఆజానుబాహుడి బట్టలు వర్షంలో మట్టి రంగుగా మారిపోయాయి పోయి ఉన్నాయి. లైన్మెన్ జాగ్రత్తగా స్తంభానికి ఉన్న వైర్ ని కట్ చేసి దిగడంతోటే వీడు ఎవడో ఏంటో ఎందుకు ఇక్కడికి వచ్చి చచ్చాడు అనుకుంటూ ముందుకెళుతుండగా బిల్డింగ్ ఓనర్ కూడా రావడంతో చూస్తే తల కూడా బోర్లా పడింది. ఎవరని ఎలా తెలుస్తుంది అనుకొని ఒక కట్ట తీసుకొని తలని ఎత్తుదామని అనుకున్న లైన్మెన్ వద్దులే మనకెందుకు పోలీసులు వచ్చి చూసుకుంటారు అనుకుని నిలబడ్డాడు. అంతలోనే పోలీసులు రావడంతో  చచ్చిన మనిషిని చేతికి బ్లౌజ్ వేసుకుని కదిలించగా చూసిన కృష్ణకి గుండె ఆగినంత పని అయింది. శ్రీహరి!