జీవితం

                     మోహన చేతివేళ్ళు ఇంకాస్త గట్టిగా బిగుసుకున్నాయి . తూలుతున్న ఒళ్ళు సాధీన పరచటానికి విశ్నప్రయత్నం చేస్తూ మెల్లగా కళ్ళెత్తి మరోసారి చూసింది శుభలేఖ వైపు .               ఎన్ని సార్లు చూసినా , ఏడుస్తూ చూసినా అక్షరాలు మారవన్న సత్యం అప్పుడు తెలిసింది . నిండా నిండిన కన్నీళ్ళ వలన మసగ్గా కనిపిస్తుందంతా .          టపాటపా జారిన రెండు కన్నీటి బొట్లు కార్పెట్ పై ఇంకిపోయాయి.                     ఒక్కసారి గట్టిగా ఏడవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించు పరుగులాంటి నడకతో వాష్ రూంలోనికెళ్ళింది .                పది నిమిషాల తర్వాత సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ