ద డోనర్

  • 300
  • 120

అధ్యాయం: ఆశల పొద్దు – అహంకారపు రాత్రిఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంట్లో పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తోంది చంద్రిక."ప్రతాప్! ఈ టవల్ తీసుకో. ఏ మాత్రం స్మెల్ రాకుండా బాగా తలంటు స్నానం చెయ్," అంటూ భర్త చేతికి టవల్ ఇచ్చింది. తను తలస్నానం చేసి, జుట్టుకు చుట్టుకున్న టవల్ ను విప్పేసి, తడి ఆరుతున్న జుట్టును అల్లుకుంటూ బయటికి వచ్చింది."రుద్రా.. ఓసారి ఇలా రా!" అని పిలిచింది."ఏంటి వదినా?" అంటూ వచ్చాడు రుద్ర."వెళ్లి ఓ తట్టెడు పూలు తీసుకురావా?" అని అడిగింది."వామ్మో! ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? ఈ పూజలకు, పునస్కారాలకు నేను రాను బాబోయ్!" అంటూ భయపడుతున్నట్లు నటించాడు రుద్ర."అబ్బా! చెప్పేది విను. ఎందుకలా ఆలోచిస్తావ్? పూజకు కావాలి," అంది చంద్రిక కాస్త కోపంగా.ఆమె చూపులకు భయపడిన రుద్ర, "సరే సరే, డబ్బులు ఇవ్వు," అన్నాడు చేతులు చాపుతూ."ఒక ఆడపిల్ల దగ్గర డబ్బులు అడగడానికి సిగ్గులేదా