ప్రణయ గీతిక - 32

  • 1.5k
  • 597

ప్రభా అమ్మకు ఒంట్లో బాగోలేదని చూపించి ఇంటిలో వదిలి అమ్మా  నేను రామపురం వెళ్లాలని అనుకుంటున్నాను అని చెప్పాడు ప్రభ. "ఇప్పుడు ఎందుకురా? " అడిగింది గౌరీ.  గోవిందు పెళ్లికి  వెళ్లలేదు కదా.  అందుకే ఒకసారి వెళ్లి పలకరిద్దామని అన్నాడు ప్రభ.  అవును కదా వాడి పెళ్లికి రమ్మని చెప్పాడు. అయినా నాకు జ్వరం రావడంతో వెళ్లలేకపోయాం. సరే  నువ్వు వెళ్ళు  మీ మేడంకి ఫోన్ చేశాను.  తను రాత్రికి ఇక్కడికి వస్తానని చెప్పారు నువ్వు వెళ్లి త్వరగా వచ్చేయ్ అని చెప్పింది గౌరీ. అమ్మకి చెప్పి రామాపురం వెళ్లి సర్పంచ్ ఇంటిదగ్గర బైక్ నిలపడంతో తాళం వేసి ఉంది . వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అనుకుని పక్కనే నిలబడిన ఒక తాతను అడగడంతో  "పెళ్లి  పొలంలోని ఇంటి దగ్గరే చేశారని,  పెళ్లి రోజు నుండి వారు పొలంలోని అక్కడే ఉంటున్నారు ."అని చెప్పడంతో సర్పంచ్ పొలంలో ఉన్న ఇంటికి వెళ్ళాడు ప్రభ.   చీకటి పడుతోంది,