నా నువ్వే - 1

  • 477
  • 147

కీర్తి... త్వరగా లేవవే! ఎంతసేపు పడుకుంటావ్? క్లాస్‌కి టైమ్ అవుతుంది...“రాత్రి రెండు వరకు ఫోన్ చూడడం... పొద్దున ఏమో దున్నపోతులా పడుకోవడం... రోజూ ఇదే పని నీకు!” అని ప్రియ కీర్తిని లేపడానికి ప్రయత్నిస్తుంది.“ప్లీజ్ బంగారం... ఇంకో టెన్ మినిట్స్ పడుకుంటా...” అని నిద్రమత్తులో అంటుంది కీర్తి.“అయినా తమరికి ఈరోజు ఏ క్లాస్ ఉందో గుర్తులేదా?” అని ప్రియ అనగానే...“ఏ క్లాస్ ఉంది బంగారం?” అని కీర్తి అడుగుతుంది.“విరాట్ సార్ క్లాస్ ఉంది బంగారం...” అని ప్రియ వెటకారంగా సమాధానం చెప్తుంది.అంతే...రెప్పపాటు క్షణంలో కీర్తి లేచి వాష్‌రూమ్‌కి పరుగెత్తుతుంది.అది చూసి ప్రియ నవ్వుకుంటూ...“తిక్క కుదిరింది!” అని అనుకునేలోపే...కీర్తి బయటికి రావడం చూసి ప్రియ షాక్ అవుతుంది.“అదేంటే! అంత వేగంగా మెరుపుతీగలా ఇలా వెళ్లి అలా ఎలా వచ్చావ్?” అని నవ్వుతూ అడుగుతుంది ప్రియ.“అయినా ఆ సైకో సార్ క్లాస్ ఉందని ముందే ఎందుకు చెప్పలేదు?” అని కీర్తి అడుగుతుంది.“తమరికి టైమ్‌టేబుల్ చూసే