ప్రణయ గీతిక - 35

  • 81

పెద్దాయన ప్రభను అర్జున్ వాళ్ళ ఇంటికి వెళదామని పిలవడంతో ఇద్దరు వెళ్లినా అక్కడ లోపలికి రానివ్వక పోవడంతో పెద్దాయన బాధపడుతూ ఉండగా " అందరికీ ధైర్యం చెప్పే మీరే ఇలా అధైర్యంగా ఉంటే ఎలా గురూజీ,  సమస్యలనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి కానీ మనం వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి ,అంతే కానీ మరి ఇంత మైనస్ గా తీసుకోకూడదు .మనం ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించాలి కచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది . మీరు ముందు బాధపడకండి సీటు బెల్టు పెట్టుకోండి " అని చెబుతున్నా అతను వినిపించుకోకుండా ఉన్నందుకు తనే సీట్ బెల్ట్ పెట్టి, తాను పెట్టుకుని బండిని కాస్త వేగంగా నడుపుతూ ఫామ్ హౌస్ కి చేరుతాడు.పెద్దాయనని ఇంటికి తీసుకెళ్లేసరికి సాయంత్రం 6 గంటలు అవుతూ ఉండగా, "ఈరోజు ఇతన్ని వదిలి నేను ఊరికి వెళ్లడం అంత బాగుండదు. ఈరోజు ఇక్కడే ఉంటేనే బాగుంటుంది," అనుకొని