పప్పు , ప్రభలిద్దరూ గీతిక గురించి మాట్లాడిన తర్వాత ప్రభ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాక "గీతిక నువ్వు ఎంత వద్దనుకున్నా నాకు మాత్రం నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది అంతేకాదు "నువ్వు నా అనుకున్నా అందుకే ఎంత కష్టమైనా సరే నిన్ను వదులుకోను. నీవు కూడా నన్ను నా అనుకునే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను . నువ్వంటే ఇంత ప్రేమ ఎందుకో తెలుసా ? నీ మనసేంటో నాకు తెలుసు. నీవు నీ తల్లిదండ్రులకు ఇచ్చే విలువ ,గౌరవం నాకు ఎంతగానో నచ్చాయి. మా అమ్మని కూడా బాగా చూసుకుంటావు అన్న నమ్మకం నాకుంది అందుకే...ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పొంది తీరుతాను." అని నిర్ణయించుకుని అద్దంలో చూసి ఓ చిన్న స్మైల్ ఇచ్చి "గుడ్ కీప్ ఇట్ అప్ ప్రభ" అని తనకు తానే చెప్పుకొని ఆరోజు రాత్రి పని ఉండడంతో డైరీ కి వెళ్లాలనుకున్నాడు ప్రభ.**జేజి, తాతయ్యలతో