ప్రణయ గీతిక - 37

  • 1.4k
  • 495

గీతిక జాబ్ కోసంమని ట్రై చేయడానికి వెళ్లగా తన కంపెనీలో సెలెక్ట్ అయ్యావు అని ఎండి చెప్పడంతో సంతోషించి బయటకు వస్తుంది. ఇప్పుడైనా చంద్రహాస్ ఎక్కడన్నా కనిపిస్తాడేమోనని చూస్తూ ఉన్న ఎక్కడ కనిపించకపోయేసరికి తనకు దప్పిక అనిపించడంతో పక్కనే కనిపించిన ఫ్రూట్ జ్యూస్ షాపులోకి వెళ్లి, ఓ మూలగా ఉన్న కుర్చీలో కూర్చుంది.“ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి,” అంటూ డబ్బులు తీసేందుకు తన బ్యాగ్ తెరిచింది.బాటిల్ చేతికి అందుకున్న గీతిక మూత తీసి రెండు గుక్కల నీళ్లు తాగింది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న సర్టిఫికెట్ల ఫైల్‌ను సరిచేసుకుంటూ, ముందున్న టేబుల్‌పై చూపు నిలిపింది.అంతలోనే “హాయ్ డార్లింగ్! ఏం కావాలో చెప్పు. ఈరోజు నీకు నచ్చినవన్నీ తీసుకో. నువ్వు అడిగితే కాదనేవాడిని కాదు కదా!” అన్న మాటలు వినిపించేసరికి, ఆ గొంతు వినగానే గీతిక చేతిలోని బాటిల్ కదలకుండా ఆగిపోయింది.ఆ గొంతు ఆమెకు బాగా పరిచయం.తలెత్తి చూసింది. ఇంకెవరు అక్కడ... తన