తన పిన్ని కొడుకు చంద్రహాస్ తనను అవమానపరిచేలా మాట్లాడడమే కాకుండా నారాయణ భార్యకు ఇంకా గీతిక బెడద తప్పించాలని చంపబోతున్న తరుణంలో పోలీస్ జీపు రావడంతో వాళ్ళు అక్కడ వదిలి వెళ్ళిపోతారు.తను" అనాధ" అన్న మాటని పదేపదే వినడం వల్ల విసుగుచ్చింది తనను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని ఇక భూమి మీద ఉండడం వ్యర్థమని భావించి రోడ్డు వైపు చూడంగా అంబులెన్స్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించినప్పటికీ గీతిక వెనక్కి తగ్గలేదు. తన అడుగులను రోడ్డు మధ్యకు వేస్తూ, ఆ వాహనం తన జీవితానికి ముగింపు పలికితే కనీసం ఈ బాధల నుంచి విముక్తి లభిస్తుందేమోనన్న ఆలోచనతో ముందుకు సాగింది.అదే సమయంలో ఏదో పని మీద అటుగా వస్తున్న ప్రభ దూరం నుంచి రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న ఆ అమ్మాయిని గమనించాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి . అయినా,