నా నువ్వే - 3

(18)
  • 1.4k
  • 546

“ఏంటే! నిజంగా ఆ లెటర్ సార్‌కి ఇస్తావా? నీకు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందే?” అని ప్రియ అడుగుతుంది.“అది కాదే! ఆ లెటర్ ఆ సైకోకి ఇచ్చేస్తే, ఆ రాక్షసుడే దాని పని చూసుకుంటాడు. అప్పుడు కానీ ఆ భవ్య తిక్క కుదరదు!” అని కీర్తి అంటుంది.కీర్తి, ప్రియ కలిసి విరాట్‌కి ఆ లెటర్ ఎలా ఇవ్వాలా అని రకరకాల ప్లాన్స్ వేస్తారు.“ప్రియా! నాకు ఒక ఐడియా వచ్చిందే!” అని కీర్తి చెప్పడంతో,“ఏంటే అది?” అని ప్రియ అడుగుతుంది.“విరాట్ సార్ క్యాబిన్ ఉంది కదా! మనం సార్ క్యాబిన్ దగ్గరికి వెళ్దాం. సార్ కరెక్ట్‌గా లోపలి నుంచి బయటికి వచ్చే టైమ్‌కి ఆ లెటర్ డోర్ దగ్గర పెట్టేసి మనం వెళ్లిపోదాం. ఎలాగో ఈ లెటర్ పెద్దగానే ఉంది కాబట్టి సార్‌కి కచ్చితంగా కనిపిస్తుంది.ఈ లెటర్ పైన భవ్య పేరు ఉంది కాబట్టి, ఈ లెటర్ భవ్య ఇచ్చిందని సార్‌కి అర్థమైపోతుంది.