రాత్రి రెండు గంటలు దాటింది.పెద్దల ఒత్తిడితో, ఇరు కుటుంబాల పరువు కోసం జరిగిన ఆ పెళ్లి తంతు ముగిసి ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది.వరండాలో ఆరిపోతున్న దీపాలు, నేలపై చెదిరిన తలంబ్రాలు. ఈశ్వర్ బరువైన అడుగులతో శోభనం గది వైపు నడుస్తున్నాడు. సమాజం అతనిపై వేసిన ముద్ర—'రెండో పెళ్లి వాడు'. మొదటి భార్య చనిపోయిన తర్వాత తన జీవితం ముగిసిపోయిందనుకున్నాడు.కానీ కుటుంబం కోసం, తన ఒంటరితనాన్ని భరించలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లిపీటలపై ఉన్నప్పుడు ముసుగులో ఉన్న అమ్మాయిని అతను సరిగ్గా గమనించలేదు.కానీ ఇప్పుడు, ఆమెకి త