అది సృష్టికి పూర్వం. పగలు లేదు, రాత్రి లేదు. భూమి లేదు, ఆకాశం లేదు. దిక్కులు, కాలం, జీవరాశులు ఏవీ లేవు. అంతటా ప్రళయజలం మాత్రమే వ్యాపించి ఉంది. ఆ అనంత జలరాశిపై ఆదిశేషుని శయ్యగా చేసుకొని శ్రీమహావిష్ణువు యోగనిద్రలో విశ్రమిస్తున్నాడు. ఆయన నాభికమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు చుట్టూ చూశాడు. కనిపించిందంతా గాఢమైన శూన్యమే. ‘‘నేను ఎవరు? నన్ను సృష్టించినది ఎవరు? ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చేయవలసిన కార్యమేమిటి?’’ అనే ప్రశ్నలు బ్రహ్మను కలవరపరిచాయి. తనకు నాలుగు ముఖాలు, అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ వాటికి సమాధానం తెలియలేదు. కమలదండం మూలాన్ని తెలుసుకోవాలని ఎంతోకాలం కిందికి ప్రయాణించాడు. అయినా అంతు కనిపించలేదు. చివరకు తిరిగి కమలంపైకి చేరుకొని ధ్యానంలో మునిగిపోయాడు. అప్పుడు అతని అంతరంగంలో ఒక దివ్యధ్వని వినిపించింది. తనను తాను తెలిసికోవాలంటే బయటకు కాదు, లోపలకు ప్రయాణించాలని ఆ ధ్వని సూచిస్తున్నట్లు అనిపించింది. బ్రహ్మ కనులు