గార్డెన్ హౌస్లో ఇక ఉండకూడదని నిర్ణయించుకున్న గీతిక, తన బ్యాగ్ తీసుకుని బయలుదేరబోతుండగా నారాయణ ఆమెను ఆపేందుకు ప్రయత్నించాడు. తన తప్పును అంగీకరిస్తూ క్షమించమని వేడుకున్నాడు. కానీ ఆయన ఎంతగా నచ్చజెప్పినా గీతిక మనసు కరగలేదు. అడుగు ముందుకు వేయబోతున్న ఆమెకు, “ఆగు!” అంటూ నారాయణ గొంతు గంభీరంగా వినిపించింది. ఆ మాటలు విన్న గీతిక అడుగులు అక్కడే ఆగిపోయాయి.“నువ్వు ఈ సమాజానికి భయపడి అందరికీ దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నావు కదూ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లీ... ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యేది ఇదే సమాజం. ఇలాంటి మనుషులే. సమాజంలో ఉండే చీడపురుగుల కోసం మనం ఇల్లు వదిలి, మనవాళ్లను వదిలి, బంధాలను తెంచుకుంటూ వెళ్తుంటే చివరికి మనకంటూ ఎవరూ మిగలరు. ఎక్కడా నిలదొక్కుకోలేం. ఏదీ సాధించలేం. అలా జీవితమంతా పారిపోతూనే ఉండాల్సి వస్తుంది. చివరికి మనం పుట్టిన ప్రయోజనమే నెరవేరకుండా పోతుంది. ఆలోచించు!” అన్నాడు నారాయణ కోపాన్ని అణచుకుంటూ.“మీరు