ప్రణయ గీతిక - 42

  • 402
  • 129

నారాయణ గీతికను కారులో తీసుకెళ్తుండగా, మరోవైపు ప్రభ మనసు మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతోంది." తనను ఇష్టపడుతున్నది నేను ! తను ఇంకా తన బాధల నుంచి బయటపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో కూడా లేదనిపిస్తోంది. తన మనసులో ఏముందో తెలుసుకోకుండా నా ఇష్టాన్ని తనపై రుద్దడం ఎందుకు? ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవించింది. నా వల్ల మరోసారి ఇబ్బంది పడకూడదు’ అని అనుకుంటూ నిట్టూర్చాడు.అంతలోనే అతని ఫోన్ మోగింది. ఆలోచనల నుంచి బయటకు వచ్చిన ప్రభ ఫోన్ తీసి కాల్ మాట్లాడాడు. అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.సారంగ్‌కు యాక్సిడెంట్ జరిగింది! అతన్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్న వార్త వినగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పప్పును తీసుకుని హాస్పిటల్‌కు బయలుదేరాడు ప్రభ.హాస్పిటల్‌కు చేరుకున్న ఇద్దరూ సారంగ్ ఉన్న గది దగ్గరకు వెళ్లారు. గాజు తలుపు అవతల కనిపించిన దృశ్యం