ప్రణయ గీతిక - 43

  • 123

ప్రభ  ధనుష్ మనుషులను కొట్టిన తర్వాత సారంగ దంపతులు ఎందుకు చనిపోయారో చెబుతారు."సారంగ్ చదువుకున్న అబ్బాయి సార్. కానీ వాడి పరిస్థితులు వాడిని ముందుకు వెళ్లనివ్వలేదు. డిగ్రీ పూర్తిచేసి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాడికి కష్టాలు తప్పలేదు. ఉద్యోగం దొరకక, చదువుకు తగ్గ పని చేయలేక చాలా ఇబ్బందులు పడ్డాడు.దీనికంతటికీ కారణం వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగుండకపోవడమే. ఆమెను కాపాడుకోవడానికి వాడు చేయని ప్రయత్నం లేదు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించాడు. అయినా చివరికి తన తల్లిని కాపాడుకోలేకపోయాడు.అమ్మ చనిపోయిన తర్వాత కూడా వాడి కష్టాలు తీరలేదు. తండ్రిని వదిలి ఎక్కడికీ వెళ్లలేక, అక్కడే ఉండిపోయాడు. చివరికి భుజంగం వాళ్ల దగ్గర అకౌంట్స్ పని చేయడానికి ఒప్పుకున్నాడు.వాళ్ల గోదాముల్లో సరుకుల లెక్కలు చూసేవాడు. అక్కడ ఏం జరిగినా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకునేవాడు.అతనికి చిన్న వయసులోనే కంటి చూపు బాగా తగ్గిపోయింది. కళ్లద్దాలు తీస్తే దగ్గరలో ఉన్నవాళ్లను