ప్రణయ గీతిక - 44

  • 210
  • 60

ప్రభ ఇంటికి చేరుకునేసరికి చరిత వాళ్లు ఇంకా రాలేదు. అయితే, తాను వెళ్లి కొద్దిసేపటికే రావడంతో ప్రభ బయటకు వచ్చాడు.“ప్రభ! ఎప్పుడొచ్చావ్? అమ్మను కూడా తీసుకురావాలి కదా!” అంది చరిత.“అమ్మా, నేను ఉదయమే వచ్చాం. కానీ మీరే ఇంట్లో లేరు,” అన్నాడు ప్రభ.“ఊరికే పిలిస్తే నువ్వు రావు, అమ్మ అసలే రాదు. అందుకే అల్లుడి కోసం ఈరోజు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారన్నమాట! చాలా సంతోషం రా! పద లోపలికి,” అంటూ నవ్వుతూ ఆహ్వానించింది చరిత.ప్రభ కూడా చిరునవ్వుతో లోపలికి వెళ్లాడు.అందరూ కూర్చున్నాక, “ఏం చేయాలి? తప్పదు కదా! మరి, మన అల్లుడెలా ఉన్నాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రభ.“డాక్టర్లు ఒకసారి చెకప్‌ చేయించమని చెప్పారు. అందుకే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. వాడికేం బాగానే ఉన్నాడులే! చూడు, ఎలా నవ్వుతున్నాడో!” అంటూ బాబును చూపించింది చరిత.అంతలో అక్కడికి వచ్చిన గౌరీని చూసి, “ఆంటీ! బాగున్నారా?” అని పలకరించింది చరిత.“బాగున్నాను చరితా! బాబును ఇటివ్వు,”