ప్రభా ఇంటికి రావడంతో గౌరీ ఎదురుగా వస్తుంది.ప్రభ! మీ మేడం ఇంటికి వెళ్లావంట సర్ బాగున్నారా అడిగింది గౌరీ . ఇంత తొందరగా ఆ న్యూస్ ఎలా వచ్చిందబ్బా అనుకొని , ఏంటో అమ్మ సార్ అలా జీవితం ఇలాగే పడి ఉన్నారు. అయినా మేడం సార్ ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నాకు తెలిసి అతను త్వరలో రికవరీ అవుతాడు . అమ్మ ! నీకు ఈ విషయం తెలుసా మేడం వాళ్ళు కొడుకున్న చోటికి వెళ్ళిపోతారంట ఆ అబ్బాయి ఈరోజు వస్తానని కాల్ చేశాడన్నారు. నాకు తెలిసి మేడం ఒక నెల రోజులు కూడా ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఇప్పుడు ఆ అబ్బాయి రావడమే ఇద్దర్ని తీసుకెళ్లడానికి అని అనుకుంటున్నా అన్నాడు ప్రభ. అవును, మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడికి దగ్గరేనని చెప్పారు కాబట్టి వెళ్లొచ్చేమో అంది గౌరి. అది విన్న తర్వాత ప్రభ తన రూమ్ కి వెళ్ళబోగా