చారితో కలిసి భరణి కోసం వెతుకుతూ ప్రభ, చారి సిటీ దాటి ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లాక తారు రోడ్డు ముగిసి, కచ్చా రోడ్డు మొదలైంది. బండి ముందుకు కదులుతున్న కొద్దీ దుమ్ము మేఘాల్లా పైకి లేస్తోంది. దూరం నుంచి చూస్తే అసలు రోడ్డు ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లు, పొదలు చిన్న అడవిని తలపిస్తున్నాయి.ఆ మార్గంలో వాహనాల రాకపోకలు కూడా పెద్దగా కనిపించడం లేదు.'బహుశా ఇది వాళ్లు నడిపే హోటల్ అయి ఉండొచ్చు. పేరుకు హోటల్ అయినా, వ్యక్తిగతంగా వాళ్లకు ఇదొక బంగ్లాలా ఉండి ఉంటుందేమో!' అని అనుకుంటూ ప్రభ బండి నడుపుతున్నాడు.అంతలో ఎదురుగా వస్తున్న ఓ జీపు కనిపించింది. అద్దం లో నుంచి ఒక వ్యక్తి దిగి, ప్రభ నడుపుతున్న బండిని పరిశీలనగా చూశాడు.“ఎవరయ్యా మీరు? ఇది భరణి బండిలా ఉంది. ఇంతకీ వాడెక్కడ?” అని ప్రశ్నించాడతను.“అవునండి, ఇది