నాకు ఇంకా ఈ కాలేజ్‌లో ఉండాలని ఉంది. TC తీసుకొని వెళ్ళిపోవాలని లేదు...అయినా ఒకవేళ లవర్ ఉంటే పాపం, ఆ అమ్మాయి ఈ సైకోని ఎలా భరిస్తుందో ఏంటో!సర్లే... బస్కి టైమ్ అవుతుంది. త్వరగా వెళ్దాం పద... అని ఇద్దరూ వెళ్ళిపోతారు.@@@@@@ఒసేయ్! గంట నుంచి అద్దం ముందు కూర్చున్నావ్. కాలేజ్‌కి టైమ్ అవుతుంది. ఎంతసేపు రెడీ అవుతావ్? అని ప్రియ అంటుంది.నీకు గుర్తులేదా? ఈరోజు అభితో మూవీకి వెళ్లాలి అని సిగ్గుపడుతూ అంటుంది కీర్తి. కానీ మధ్యాహ్నం క్లాస్ ఉంది కదే...విరాట్ సార్ క్లాస్ లేదు కదా! మార్నింగ్ ఎలాగో విరాట్ సార్ క్లాస్ ఉంది. ఇంకా మధ్యాహ్నం వెళ్లిపోవచ్చు.ఈరోజు ఎలాగైనా అభి మనసులో ఏముందో తెలుసుకోవాలి... అని కీర్తి అంటుంది.చాలా అందంగా ఉన్నావే! ఇలా చూస్తే పడిపోతాడు అభి... అని దిష్టిచుక్క పెడుతూ అంటుంది ప్రియ.అభి వచ్చి టికెట్ ఇస్తా అన్నాడు. త్వరగా వెళ్ళాలి పద... అని ఇద్దరూ కాలేజ్‌కి వెళ్తారు.కీర్తి