పీఠిక :టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మనం తినే ఆహారం నుండి, పడుకునే పడక వరకు అంతా యంత్రమయం. కానీ, మనిషికి మాత్రమే ఉండే 'మనసు', ఆ యంత్రానికి కూడా ఉంటే? ప్రోగ్రామింగ్‌తో నడిచే రోబో, ప్రేమని కూడా ప్రోగ్రామ్ చేసుకోగలదా? ఆధునిక యుగంలో ఒక యువతికి, ఒక రోబోకి మధ్య చిగురించిన వింతైన, సున్నితమైన ప్రేమకథే ఈ 'యంత్రం వెనుక మనసు'.యంత్రం వెనుక మనసు:అధ్యాయం 1: మారుతున్న కాలం.. మారని మనసుసంవత్సరం 2050. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఒక అద్భుత లోకంలా ఉంది. పాతబడ్డ రోడ్ల మీద ఇప్పుడు ఎగిరే వాహనాలు (Drone Taxis) రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. నగరం నిండా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గాజు భవనాలు.. సాయంత్రం అయితే చాలు, ఆ భవనాల మీద వెలిగే లేజర్ లైట్లు నగరాన్ని ఒక రంగుల కలలా మారుస్తున్నాయి.అప్పట్లో మనుషులు పనుల కోసం ఉరుకులు పరుగులు పెట్టేవారు. కానీ
Full Novel
యంత్రం వెనుక మనసు - 1
పీఠిక :టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మనం తినే ఆహారం నుండి, పడుకునే పడక వరకు అంతా యంత్రమయం. కానీ, మనిషికి మాత్రమే ఉండే ఆ యంత్రానికి కూడా ఉంటే? ప్రోగ్రామింగ్‌తో నడిచే రోబో, ప్రేమని కూడా ప్రోగ్రామ్ చేసుకోగలదా? ఆధునిక యుగంలో ఒక యువతికి, ఒక రోబోకి మధ్య చిగురించిన వింతైన, సున్నితమైన ప్రేమకథే ఈ 'యంత్రం వెనుక మనసు'.యంత్రం వెనుక మనసు:అధ్యాయం 1: మారుతున్న కాలం.. మారని మనసుసంవత్సరం 2050. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఒక అద్భుత లోకంలా ఉంది. పాతబడ్డ రోడ్ల మీద ఇప్పుడు ఎగిరే వాహనాలు (Drone Taxis) రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. నగరం నిండా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గాజు భవనాలు.. సాయంత్రం అయితే చాలు, ఆ భవనాల మీద వెలిగే లేజర్ లైట్లు నగరాన్ని ఒక రంగుల కలలా మారుస్తున్నాయి.అప్పట్లో మనుషులు పనుల కోసం ఉరుకులు పరుగులు పెట్టేవారు. కానీ ...Read More
యంత్రం వెనుక మనసు - 2
నీలా ! నువ్వు ఏది అడిగినా అమ్మ ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తుంది కదా, నేనేమైనా అన్నానా చెప్పు? మరి ఇప్పుడు నాన్న నాకు సపోర్ట్ నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు?" అని నీలా తన అన్న ఆర్య నీ ఆటపట్టించింది.రాజు నవ్వుతూ, "సరే సరే ఇంకా చాలు.. ఇప్పటికే మీ అల్లరి ఎక్కువైంది. నీలా! ఇప్పటికైనా ఆ రిమోట్‌లో బటన్ నొక్కు" అన్నాడు. నీలా బటన్ నొక్కగానే.. కొంచెం 'కిర్' అనే శబ్దం వచ్చి ఆగింది. రాజు వెంటనే "ఆ బ్లూ కలర్ బటన్ కూడా ప్రెస్ చేయి" అని చెప్పగానే నీలా అది నొక్కింది. వెంటనే ఆ బాక్స్ లో నుండి ఒక రోబో బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే నీలా అలా ఉండిపోయింది. ఆరడుగుల ఎత్తు, ఆపిల్ పండు లాంటి ఛాయ, నీలం రంగు కళ్లతో అతను అచ్చం మనిషిలాగే ఉన్నాడు. మనీషా ఇంతకి రోబో నా ? ...Read More
యంత్రం వెనుక మనసు - 3
మరుసటి రోజు ఉదయం.. ఇంట్లో వాతావరణం ఎప్పటిలాగే సందడిగా ఉంది. అయాన్ ఇంటి పనులన్నింటినీ ఎంతో చకచక చేసేస్తున్నాడు. వంటగదిలో సుస్మిత టిఫిన్ చేయడంలో నిమగ్నమై రాజు గారు అక్కడికి వచ్చారు."ఏమిటి సుస్మిత.. ఇవాళ ఏం టిఫిన్? ఈ దోశలు ఎప్పుడూ నీ ముద్దుల కొడుకు కోసమేనా లేక మా కోసం కూడా ఏమైనా మిగిల్చావా?" అని రాజు గారు సరదాగా అడిగారు. సుస్మిత నవ్వుతూ, కంటి సైగతో పక్కనే ఉన్న హాట్ బాక్స్‌ని చూపించింది.అందులో వేడివేడి పూరీలు పక్కనే పూరి కూర్మ చూసి రాజు గారు మురిసిపోతూ, "థాంక్యూ మై బెటర్ హాఫ్!" అంటూ ఆమె బుగ్గ గిల్లుతుండగా.. సరిగ్గా అదే సమయానికి నీల అక్కడికి వచ్చింది. అమ్మానాన్నల అన్యోన్యతను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెనుతిరిగింది.బయటకు రాగానే అయాన్ ఎదురై, "గుడ్ మార్నింగ్ నీల!" అన్నాడు. ఆ పిలుపు వినగానే నీల గుండెలో ఏదో ...Read More
యంత్రం వెనుక మనసు - 4
"ఏమిటో చెప్పు ఆర్య, తప్పకుండా చేస్తాను" అన్నాడు అయాన్ తన మెకానికల్ వాయిస్‌లో."మా చెల్లి ఉంది చూడు.. ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఈసారి నేను ఆటపట్టించాలి. ఏం చేసినా తనే గెలుస్తోంది, నేనే ఓడిపోతున్నాను. తనకి నా మీద భయం పుట్టాలి. నా పేరు వింటేనే గజగజ వణికిపోయేలా ఏదైనా ఐడియా ఉంటే చెప్పు" అని అడిగాడు. అలా తన పేరు చెప్పగానే నీల భయపడిపోవాలని ఊహించుకుంటూ ఆర్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.వెనుక నుండి నీల వచ్చి ఆర్య నెత్తి మీద ఒక్కటి చరిచింది."అది ఎప్పటికీ జరగదు లేరా అన్నయ్య! ముందర రా.. అమ్మ టిఫిన్ తినడానికి రమ్మంటోంది" అంటూ గట్టిగా నవ్వుతూ అక్కడి నుండి పారిపోయింది. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్య నోరెళ్లబెట్టాడు.అందరూ టిఫిన్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్లేట్లలో వేడివేడి దోశలు ఆవిర్లు కక్కుతున్నాయి. నీల పక్కనే కూర్చున్న ఆర్య, ఆమె వైపు ...Read More
యంత్రం వెనుక మనసు - 5
ఇదంతా బయట నిలబడి చూస్తున్న అయాన్, ఆ దృశ్యాలను తన మెమరీలో సేవ్ చేసుకున్నాడు. మనుషుల మధ్య ఉండే ఈ విడదీయరాని బంధాన్ని, ఒకరు లేనప్పుడు పడే ఆ వేదనను చూసి.. ఒక యంత్రమైనా సరే, అయాన్ లోపల ఏదో తెలియని అనుభూతి కలిగింది.రాజు గారు వెళ్తూ.. "అయాన్! నేను ఇంట్లో ఉండను కదా, నువ్వే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి" అని బాధ్యత అప్పగించారు. "అలాగే సార్!" అని అయాన్ ఆయన సూట్‌కేస్ కారులో పెట్టి, సాగనంపి తిరిగి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు.అయాన్ లిఫ్ట్ దగ్గరకు రాగానే, అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. "ఎవరీ హ్యాండ్‌సమ్ బాయ్?" అనుకుంటూ అతని చుట్టూ చేరారు. లిఫ్ట్ ఎక్కనివ్వకుండా అతడిని ప్రశ్నలతో ముంచెత్తారు. "ఎవరు నువ్వు? ఏ ఫ్లాట్ మీది?" అని అడుగుతుంటే అయాన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు.అంతలో కొందరు ఆకతాయి అబ్బాయిలు కూడా అక్కడికి వచ్చారు. ...Read More
యంత్రం వెనుక మనసు - 6
షీలా! నువ్వేంటి అసలు మాట్లాడటం లేదు? ఏం చేస్తున్నావు షీలా?" అంటూ నీల తన భుజం మీద చేయి వేసేసరికి, షీలా ఉలిక్కిపడింది. అప్పటిదాకా ఆమె వైపే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది.అప్పుడు నీల, "ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న నీకు ఫోన్లో చెప్పాను కదా.. ఇతనే అయాన్! అయాన్, తను నా స్నేహితురాలు షీలా," అని పరిచయం చేసింది. దానికి షీలా, "అవసరం లేదు నీలా.. ఇందాకే మాకు పరిచయం అయ్యింది," అని కొంచెం సిగ్గుపడుతూ అంది.నీలకు అర్థం కాలేదు. 'షీలా ఎందుకు అంతలా సిగ్గుపడుతోంది? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది?' అని తనలో తాను ఆలోచించుకోసాగింది. అప్పుడే సుస్మిత కాఫీ పట్టుకొని వచ్చింది. షీలా కి ఇస్తూ "నీలా! కాలేజీకి వెళ్ళావు కదా.. అప్పుడే వచ్చావేంటి?" అని అడిగింది."లేదమ్మా, ఈరోజు సార్ రాలేదని సెలవు ఇచ్చారు," అని చెప్పింది నీల."మరి అన్నయ్య ఎక్కడ?" అని అడిగితే, "అన్నయ్యకు ...Read More
యంత్రం వెనుక మనసు - 7
ఆర్య ఆఫీస్ నుండి ఇంటికి రాగానే, సుస్మిత వడ్డించిన భోజనం తింటూ ఉదయం నుండి జరిగిన విషయాలన్నీ వింటున్నాడు. సుస్మిత చెబుతున్న మాటలు ఒక ఎత్తైతే, ఆలోచనలు మరొక ఎత్తులో ఉన్నాయి. తన చెల్లి నీలా ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ మార్పు అతనికి అంతుచిక్కడం లేదు.మరుసటి రోజు ఉదయం.. సూర్యుడు తన పనుల్లో తాను బిజీగా ఉన్నట్టే, ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. నీలా కాలేజీకి రెడీ అయి హాల్‌లోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ సోఫాలో షీలా, అయాన్ కూర్చుని ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. అది చూసి చూడనట్టుగా షీలాను పలకరించి, లోపలికి టిఫిన్ చేయడానికి వెళ్ళింది నీలా.టిఫిన్ తింటున్నట్టు నటిస్తోందే కానీ, నీలా మనసు లోపల ఉప్మా లాగా ఉడికిపోతోంది. తన అయాన్‌తో షీలా అంతలా ఏం మాట్లాడుతోంది? ఆర్య తన గదిలో ఉన్నాడని తెలిసి, తన కోపాన్ని బయట పడకుండా మేనేజ్ ...Read More
యంత్రం వెనుక మనసు - 8
సుస్మిత ఆ పాత సంఘటనను తలచుకుంటూ దీర్ఘాలోచనలో పడిపోయింది. సుస్మిత కు గతం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నీలా కాలేజీలో కొత్తగా చేరిన రోజులు. ఒక ఆకతాయి నీలాను నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. కానీ నీలా ఆ విషయాన్ని ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. ఒకవేళ చెబితే, తన తల్లి పాతకాలం మనిషి కాబట్టి, ఎక్కడ తన చదువు ఆపేసి ఇంట్లో కూర్చోబెడుతుందో అన్నది నీలా భయం. కానీ ఆ రోజు ఆ ఆకతాయి శృతి మించి ప్రవర్తించాడు.సరిగ్గా అదే సమయంలో, నీలా మరిచిపోయిన లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆర్య కాలేజీకి వచ్చాడు. అక్కడ తన చెల్లిని ఒకడు అసభ్యంగా వేధిస్తుండటం చూసి ఆర్య రక్తం మరిగిపోయింది. పిడుగుల్లాంటి దెబ్బలతో వాడిని చితకబాదేశాడు. నీలా కు ఆర్య కు ఎన్ని గొడవలు ఉన్న చెల్లిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు నీలా కూడా అంతే ఎంత ఏడిపించిన తనే ...Read More