అరుణ చంద్ర - 4

  • 9.5k
  • 3.4k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 4 "బాబోయ్ ఇక్కడిదో పోబియాలా ఉంది. పద సుశీల. ఇక్కడ నేను ఉండలేను" అంటూ లేచాడు అప్పారావు."మామయ్యా" అని పిలిచింది అరుణ, అప్పుడే."ఏమ్మా. నువ్వేం చెప్పుతావు. అదే చెప్పుతావులే. ఎంతైనా వీళ్ల కూతురువే కదా" అన్నాడు అప్పారావు."అంత అసహనం ఎందుకు మామయ్యా. మనం తిన్న తిళ్లును, మనం ఉన్న ఇళ్లును, మనం కట్టుకున్న బట్టలును, ఇలా ఎన్నింటినో, ఆ అన్నింటినీ మన మన సొంత సంబంధీకులే సమకూర్చి మనకు పెడుతున్నారా. వాటికి లేని అభ్యంతరం, అక్కడ రాని ఆంతర్యం, పెళ్లి బంధంకు మాత్రం ఎందుకు పట్టి పట్టి వెతుకుతున్నాం. ఇదేం పద్ధతి మామయ్యా. ఘోరం అనిపించడం లేదు, సిగ్గు అనిపించడం లేదు. ఆఁ. మా అమ్మ, నాన్న ప్రవర్తనలో తప్పు వెతుకుతున్నారు ఎందుకు మామయ్యా." అని మాట్లాడింది అరుణ.అక్కడ నిశ్శబ్దం ఉంది, కొంతసేపు.ఆ పిమ్మట, అరుణ, "మీరూ ఆలోచించండి మామయ్య. ఏదైనా ఎవరికి వారం