ఆ ముగ్గురు - 9

  • 6.2k
  • 2.7k

మతం లాంటి సున్నితమైన విషయాలను ఇలా ఆలోచించి అర్థం చేసుకోవాలి . అకారణంగా ఇతర మతాలను దూషించడం ఒక వ్యసనం గా అలవాటు చేసికోకూడదు . ఇక మత వ్యాప్తి అన్నది చాలా సున్నితమైన అంశం . నేను అధ్యయనం, స్వానుభవంతో తెలుసుకున్న ధర్మసూత్రాలను , జీవిత సత్యాలను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలి . కష్టాలకు , కన్నీళ్ళ కుకారణం తెలియజేయాలి . అహింసో పరమో ధర్మః అన్న బుద్ధుడి మహా వాక్యాన్ని , మానవత్వపు విలువల్ని ప్రజావాహిని లోకి తీసుకుని వెళ్ళాలి . " అన్న మహదాశయం తో భిక్షువులు తూర్పు ఆసియా దేశాల్లో పర్యటించారు . వారిది సాత్విక ప్రవృత్తి . హింసకు పూర్తిగా వ్యతిరేకులు . వాళ్ళ కు రాజ్య కాంక్ష లేదు . కనుక శత్రువులు కూడా లేరు.సామాన్యుల లో పరివర్తన తేవటం వారి లక్ష్యం . అందుకే బౌద్ధం తూర్పు