ఆ ముగ్గురు - Novels
by LRKS.Srinivasa Rao
in
Telugu Novel Episodes
నాకు తెలిసి ఉగ్రవాదం వైపు మళ్ళిన వారిని రెండు వర్గాలు గా విభజించవచ్చు. ఒక వర్గం వారు మతోన్మాదులు.వారిని అల్లా కూడా మార్చలేడు. వారిది విథ్వంసక ప్రవృత్తి. మరో వర్గం వారిలో చాలామంది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉగ్రవాదానికి బలవుతున్నారు. ప్రస్తుత రచన "ఆ ముగ్గురు" లో అన్వర్,అలీ, యాకూబ్, రెండో కోవకు చెందిన ...Read Moreవిభిన్న సామాజిక నేపథ్యాల నుండి ఉగ్రవాదం వలలో చిక్కిన ఈ ముగ్గురు ఎలా జీవన స్రవంతి లోకి రాగలిగారో , ఏ అనూహ్య పరిస్థితులు ఈ మార్పుకు కారణం అయినాయో అన్నది. ఈ నవల ప్రథాన శిల్పం.
Three young muslim boys from different family background are forced to accept religious terrorism due to financial circumstances.They come out of the dangerous situation after facing mental agony realizing the need of universal brotherhood.
జమ్మూ కు అవతలి P O K లో ఆ మట్టి రోడ్లో ఓ ట్రక్కు ఆగింది. భారత్ --పాక్ సరిహద్దు కు అతి సమీపంలో ఉన్నఓ కుగ్రామం ఆనుకునే ఆ రోడ్డు వుంది. అన్వర్ తో ఆ నలుగురు దిగారు. " జాగ్రత్త ! All ...Read Morebest." ఆ రెండు ముక్కలు అని ట్రక్కు డ్రైవర్ బండి రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ క్షణం వారిసాహస యాత్ర ప్రారంభం అయింది. అక్కడ నుండి చిట్టడవి, కొండల వరుస ఆరంభం అవుతాయి. అన్వర్ జేబులోంచి రూట్ మ్యాప్ తీశాడు. ఓ నిమిషం మ్యాప్ ను పరిశీలించాడు. ఆ కొండ వైపే మన ప్రయాణం." చూపుడు వేలితో ఓ కొండ ను చూపిస్తూ ముందుకు అడుగులు వేశాడు. ఆ నలుగురు అతడిని అనుసరించారు. కొండ ముందున్న కాలి బాటలో అడుగులు వేస్తున్నారు. అప్పుడప్పుడూ ఒకరిద్దరు కాలిబాటలో ఎదురవుతున్నారు.
సూర్య కిరణాలే సోకని శీతల వాతావరణం. పగటి లో సగభాగం గడిచిపోయినా చలి తీవ్రత తగ్గలేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అన్వర్, అతడి టీం సభ్యులు. జమ్మూ ప్రాంతంలో LOC కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.పగటి సమయం కనుక అడవి జంతువుల బెడద అంతగా ఉండదు. ...Read Moreవారి నడకలో ధీమా,వేగం కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వారు నడుస్తున్నప్పుడు బూట్ల క్రింద నలిగే ఆకుల చిరు సవ్వడిస్పష్టంగా కనిపిస్తోంది. ఆకుల పై పేరుకున్న మంచు వారుఆకులను తగిలినప్పుడు. చెదిరి క్రిందక జారుతోంది. ప్రకృతి చీకటి ముసుగులో జోగుతున్నప్పుడే వారి ప్రయాణం మొదలైంది. అలా నడుస్తూ వారు ఓ సమయంలో ప్రదేశానికి వచ్చారు.అక్కడో మిలిటరీ పోస్ట్ ఉంది. రెండు చిన్న గ్రామాలకు వేదిక అది. అబుల్ సలాం పేరు చెప్పగానే అవుట్ పోస్ట్ ఇన్చార్జి లో మంచి స్పందన
B S F గార్డ్స్ అలీ ని క్యాంప్ హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. ఎమర్జెన్సీ కేసు గనుక గంట వ్యవధిలో నే మైనర్ ఆపరేషన్ చేసి గాయానికి కట్టు కట్టారు. అలీ I C U లో ఉన్నాడు. సెడేషన్ ప్రభావం వల్ల ...Read Moreలో లేడు. ఓ సీనియర్ ఆఫీసర్ , డ్యూటీ డాక్టర్ I C U లోకి వచ్చారు." కండిషన్ ఎలా ఉంది ?" " స్టేబుల్. హి ఈజ్ అవుటాఫ్ డేంజర్. "" నార్మల్ కండిషన్ కు ఎప్పుడు రాగలడు ?"" జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్. కాని రెండు రోజులు రెస్ట్ లో ఉండాలి. డాక్టర్ ఉద్దేశ్యం ఆఫీసర్ కు అర్థమైంది." యూ మీన్ , రెండు రోజులు ఫార్మాలిటీస్ తో అతడిని డిస్ట్రబ్ చేయకూడదు. జవాబుగా డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. ఆఫీసర్ చిన్నగా నిట్టూర్చాడు. " ఓకే , ప్లీజ్ ! టేక్ కేర్ ఆఫ్ ది
ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు సాయంత్రం అలీకి స్పృహ వచ్చింది. మెడ దగ్గర సూదులు గుచ్చినట్లు భరించలేనట్లు బాధ . ఒక్క క్షణం ఆ రాత్రి ని తలచుకున్నాడు. నీడలా వెంటాడే పీడకల . ఒళ్ళు జలదరించింది." హౌ ఆర్ యూ ఫీలింగ్ ?" స్వరం ...Read Moreఉన్నా మాటల్లో మెత్తదనం. కళ్ళు తెరిచాడు అలీ. బెడ్ పక్కన నిలుచున్న ఓ సీనియర్ ఆఫీసర్, ప్రశాంత మైన చూపులు.చిరునవ్వు. వయసుతో , అనుభవం తో నిండిన ఫలిత కేశాలు-- నిండైన రూపం.బాగుందంటూ నెమ్మదిగా తల వూపాడు అలీ." నౌ యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. బాగా రెస్ట్ తీసుకో. భయపడకు. నీ బాధ్యత పూర్తిగా మాదే." భుజం తట్టాడు ఆఫీసర్.ఆ పొడవాటి కారిడార్ లో చకచకా నడుస్తున్న ఆఫీసర్ తో ఇద్దరు జూనియర్స్ పరుగులాంటి నడకతో ఆఫీసర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు." అగ్రెసివ్ గా లేడు. పాజిటివ్ ఆటిట్యూడ్ కనపడుతోంది
" గుడ్ మార్నింగ్ అలీ ! " " గుడ్ మార్నింగ్ సర్ ! " అలీ సర్దుకుని నిటారుగా కూర్చున్నాడు. " ఫీల్ ఫ్రీ " అని భుజం తట్టి ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.అలీ చెప్పేది రికార్డు చేసేందుకు ప్రక్కనే ఉన్న కుర్చీలో ఉన్న జూనియర్ ఆఫీసర్, ...Read Moreదగ్గర సాయుధుడైన సెక్యూరిటీ, పరిస్థితి అర్థ మయింది అలీకి. తను అందుకు సిద్ధంగా ఉన్నాడు. " వెంట్రుక వాసిలో చావు తప్పించుకోవడం కేవలం నీ అదృష్టం. నీ ఆలోచన, జీవించే పద్దతి మార్చుకోవడానికి ఇదొక అవకాశం. మాతో సహకరించి, మాకు కావల్సిన సమాచారం ఏదీ దాచకుండా పూర్తిగా చెబితే నీకు అన్ని విధాలా మంచిది." అలీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రావ్. " తప్పకుండా ! మీరు నా ప్రాణం కాపాడారు. మీకు సహకరించటం నా ధర్మం." " వెరీ గుడ్. దట్ ఈజ్ ఎ గుడ్ గెశ్చర్." రావ్ ముఖంలో ప్రసన్నత.అలీ
అన్వర్ రాడార్ పరిధిలో కి రాకపోవడం నిజంగా ఓ అద్భుతం ! ఊహించని టర్నింగ్ పాయింట్ . " అతడు నిలుచుంది కొండవాలు చివర సర్ . పైగా మంచుపడుతోంది . సీక్రెట్ కెమెరా గురి తప్పించుకోవడానికి ఈ రెండూ కారణాలు కావచ్చు . ఏదైమైనా అన్వర్ భాయ్ ...Read More. చావు తప్పించుకున్నాడు . మనకు, తెలంగాణా ఇంటెలిజెన్స్ వింగ్ కు చేతి నిండా పని కల్పించాడు . రావ్ మాటలకు నవ్వాడు జూనియర్ . " స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్ లో ఇంతియాజ్ అనే ఏ.సి.పి స్థాయి ఆఫీసర్ ఉన్నాడు . కౌంటర్ మిలిటెంట్ ఆపరేషన్స్ నిర్వహించటంలో ట్రైనింగ్ తీసుకున్నాడు . డిపార్ట్మెంట్ తరపున మన మెసేజ్ అతడే రిసీవ్ చేసుకుంటాడు . వెల్ ట్రైన్స్, డ్యూటీ మైండెడ్ అండ్ వెరీ డైనమిక్ . " అన్వర్ సెర్చ్" అతడి పర్వ్యూ లోకే రావచ్చు. నేను రెకమెండ్ చేస్తాను
అన్వర్ హూసేన్ ... హైదరాబాదీ...పి.ఓ.కే మిలిటెంట్ క్యాంప్ లో విగరస్ ట్రైనింగ్. ఆవేశం కన్నా ఆలోచన పాలు ఎక్కువ . టీం లీడర్ గా సరిహద్దు దాటుతూ బ్రతికి పోయాడు. ఇప్పుడీ మహానగరం జనసంద్రం లో కలిసి పోయారు. అతడి ఆచూకీ తెలుసుకోవటం మన డ్యూటీ. " ...Read Moreకంప్యూటర్ ఇమేజ్ చూస్తూ ఇంతియాజ్ అన్న మాటలివి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ..స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ కంబాటింగ్ మిలిటెంట్ ఎటాక్స్. " ఉన్న జిహాద్ లు చాలవన్నట్లు పులి మీద పుట్రలా ఆపరేషన్ జన్నత్ ఏమిటి సార్ ?" అతడి అసిస్టెంట్ విహారి గొంతులో చిరాకు. మా భాషలో జన్నత్ అంటే స్వర్గం. స్వర్గానికి జిహాద్ కు ఏమిటి కనెక్షన్. " విహారి ని చూశాడు. " అదే సార్ ! నా ప్రశ్న కూడా . ఏమిటి కనెక్షన్ ? " అర్థం కాక బుర్ర గోక్కున్నాడు.
మతం లాంటి సున్నితమైన విషయాలను ఇలా ఆలోచించి అర్థం చేసుకోవాలి . అకారణంగా ఇతర మతాలను దూషించడం ఒక వ్యసనం గా అలవాటు చేసికోకూడదు . ఇక మత వ్యాప్తి అన్నది చాలా సున్నితమైన అంశం . నేను అధ్యయనం, స్వానుభవంతో తెలుసుకున్న ధర్మసూత్రాలను , జీవిత సత్యాలను ...Read Moreచేసి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలి . కష్టాలకు , కన్నీళ్ళ కుకారణం తెలియజేయాలి . అహింసో పరమో ధర్మః అన్న బుద్ధుడి మహా వాక్యాన్ని , మానవత్వపు విలువల్ని ప్రజావాహిని లోకి తీసుకుని వెళ్ళాలి . " అన్న మహదాశయం తో భిక్షువులు తూర్పు ఆసియా దేశాల్లో పర్యటించారు . వారిది సాత్విక ప్రవృత్తి . హింసకు పూర్తిగా వ్యతిరేకులు . వాళ్ళ కు రాజ్య కాంక్ష లేదు . కనుక శత్రువులు కూడా లేరు.సామాన్యుల లో పరివర్తన తేవటం వారి లక్ష్యం . అందుకే బౌద్ధం తూర్పు
" సాగర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ " ఆ అడ్మిన్ బ్లాక్ పైన సైన్ బోర్డ్ మెరిసి పోతోంది . ఉదయం తొమ్మిది గంటల సమయం . క్యాంపస్ , క్యారిడార్స్ , స్టూడెంట్స్ తో , ఫ్యాకల్టీ మెంబెర్స్ తో సందడిగా ఉన్నాయి . అప్పుడే ఓ ...Read Moreఫీల్డ్ బైక్ రిథమిక్ బీట్ తో స్కూటర్ స్టాండ్ లో వచ్చి ఆగింది . ఓం వ్యక్తి , మరీ ఆజానుబాహుడు కాదు . కాని ఎత్తుగా , హుందాగా ఉన్నాడు. బైక్ దిగి రిమ్ లెస్ గ్లాసెస్ మధ్య వేలితో సున్నితం గా సవరించుకొని ప్రిన్సిపాల్ ఛాంబర్ వైపు అడుగులు వేశాడు . నడకలో ఠీవి , ప్రతి అడుగు లో ఆత్మ విశ్వాసం..... మొదటి చూపులోనే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలడు . " మే ఐ కమిన్ సార్ ?" ఏదో ఫైల్స్ చూస్తున్న ప్రిన్సిపాల్
ఏ.సి.పీ ఇంతియాజ్ కారు ఓ విశాల భవనం ముందు ఆగింది . మెయిన్ గేటు గోడ మీద " పరాంకుశరావు " అనే అక్షరాలు బ్లాక్ గ్రానైట్ ప్లేట్ మీద బంగారు రంగులో మెరిసిపోతున్నాయి . గేటు ముందు సెక్యూరిటీ సిబ్బంది పహారా బలంగా ఉంది . పరాంకుశరావు ...Read Moreరాష్ట్ర హోం మినిస్టర్ . " గుడ్ ఈవినింగ్ సార్ " ఇంతియాజ్ విష్ చేశారు . ఏదో ఫైలు చూస్తున్న పరాంకుశరావు తలెత్తి చూశాడు . " హలో ఇంతియాజ్ ! హౌ ఆర్ యూ ?" చిరునవ్వు తో పలకరించాడు పరాంకుశరావు . " ఫైన్ సార్ ! " ఎదురుగా కూర్చున్నాడు ఇంతియాజ్ . ఆ విశాలమైన , ఖరీదైన గదిలో అన్నీ పొందికగా అమరి ఉన్నాయి . ఏ. సి చల్లదనం హాయిగా ఉంది . " ఈ మధ్య నువ్వు మన ఊరికి వెళ్ళావా ?" ఫైలు మూసి వెనక్కు వాలుతూ
ఎంతటి మేధావి నైనా అప్పుడప్పుడు హెచ్చరించేవారు లేకపోతే వారి మెదడు చైతన్యం తగ్గి మందగిస్తుంది . బద్ధకం పని వేగాన్ని , వ్యూహాన్ని తగ్గిస్తుంది . ఇంతియాజ్ విషయంలో అదే జరిగింది. తిరిగి పరాంకుశరావు మందలింపు తో ఉలిక్కిపడి దారిలో పడ్డాడు . ...Read Moreఊహ అక్షరాల నిజం . ఆపరేషన్ జన్నత్ లక్ష్యం వెపన్ అటాక్స్ కాదు . వారి వ్యూహం చాప కింద నీరులా సిటీ ని మెల్ల మెల్లగా అల్లుకుంటోంది . ఈ ఆపరేషన్ కు అవసరమైన గుణాలు పుష్కలంగా ఉన్నవాడు అన్వర్ హుస్సేన్. నగర జనవాహిని లో చాలా సులభంగా , సహజంగా కలిసిపోయాడు. చాలా సామాన్యుడు . పబ్లిక్ ప్లేసెస్ లో , స్లమ్స్ లో, తోపుడు బండి మీద చిన్న చిన్న రోజు వారీ వస్తువులను మారుబేరానికి అమ్మే మొబైల్ వెండార్ పేరు అనంత్ రామ్. ఇంతియాజ్ ఊహా చిత్రం
పెంట్ హౌస్ చిన్నదైనా పొందికగా, సౌకర్యం గా ఉంది. అనంత్ రామ్ ఆ గదిని చాలా శుభ్రంగా ఉంచుతాడు. చాలా సాదాసీదాగా ఉన్న ఆ గదిలో ఒక ట్రంకు పెట్టె. దాని ప్రక్కనే బోషాణం లాంటి చెక్కపెట్టె. ఆ పెట్టె కు ఎప్పుడూ తాళం వేసి ...Read More గదికి ఒక వైపు దండెం.పైన వేలాడుతున్న గుడ్డలు. ఓ ప్రక్క చక్కగా అమర్చిన వంటసామాను. చిన్న గ్యాస్ స్టౌ.ఒక మడత కుర్చీ. ఒక ప్లాస్టిక్ నవారు మంచం. ఫక్తు బ్రహ్మచారి నివాసం. ఓ మూల చిన్న స్టూల్.దానిమీదకృష్ణ విగ్రహం. బేలూరు శిల్పం. అనంత్ రామ్ స్నానం చేసి శుభ్రం గా ఉన్నాడు. గడ్డాలు మీసాలు లేవు . నున్నగా షేవ్ చేసుకున్నాడు . పైకి దువ్విన క్రాఫ్. విశాలమైన నుదుటిపై మెరుస్తున్న సింధూరపు రేఖ . ఎడమ కనుబొమపై వెంట్రుకల్లో కలిసిపోయే పాత గాయం తాలూకు మచ్చ. చిరుత కదలికలు . చురుకైన
కాలేజి ఓపెన్ ఆడిటోరియం లో ఫ్రెషర్స్ డే జరుగుతున్నది. ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ, కొంతమంది సీనియర్స్, ధైర్యం కూడగట్టుకుని కొంతమంది జూనియర్స్ మాట్లాడారు . ఇదిలా ఒక్కసారి గా అభిప్రాయాలు, అభిరుచులు పంచుకోవటంతో కొత్తవారిలో కాస్త బెరుకు తగ్గింది . సంకోచం లేకుండా సీనియర్స్ తో కలిసిపోయారు . ...Read Moreచివరి ఐటమ్ డిన్నర్. చేతిలో ప్లేట్స్ తో గ్రూపు లుగా నిలబడి మాట్లాడుకుంటూ తింటున్నారు . ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ మూలకు చేరారు . వారికి కావలసినవి కాలేజీ అటెండెర్స్ సర్వ్ చేస్తున్నారు . వారిలో ఒకరు ఆదిత్య దృష్టి ని ఆకర్షించారు . క్షణం ఒక్కచోట నిలబడకుండా సుడిగాలిలా తిరుగుతున్నాడు . కాసేపు స్టాఫ్ దగ్గర ఉంటాడు . కాసేపు స్టూడెంట్ గ్రూపు ల మధ్య తిరుగుతూ సర్వ్ చేస్తున్నాడు . మాటల చురకలతో, టైమ్లీ జోక్స్ తో అందరినీ నవ్విస్తూ చాలా డైనమిక్ గా కనిపించాడు . మెహర్ ఒంటరిగా ఓ మూల నిలుచుని
కలికివాయి బిట్రగుంట . చెన్నై -కోల్ కటా నేషనల్ హైవేస్ -5నుండి అరకిలో మీటరు ఎడమవైపు డైవర్షన్ రోడ్లో వెళితే కనిపించే గ్రామం . మరీ పెద్దది కాదు.మరీ చిన్నది కూడా కాదు. ఆ ఊరే ఇంతియాజ్ పుట్టిన గడ్డ. ఒక్క ఇంతియాజే కాదు, రెవెన్యూ ...Read Moreషేక్ మస్తాన్, హోంమంత్రి పరాంకుశ రావు, మిషన్ జన్నత్ వ్యవస్థాపకుడు ఇనాయతుల్లా ఆ గడ్డ పైనే ఊపిరి పోసుకున్నారు. ఇంతియాజ్ తండ్రి ఒక హైస్కూల్ టీచర్. మస్తాన్ తండ్రి ఆ గ్రామం పోస్టాఫీసు నుండి సమీపంలో ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న శింగరాయ కొండ సబ్ పోస్టాఫీసు కుఉత్తరాల సంచులు మనిఆర్డర్లు బట్వాడా చేసే చిరుద్యోగి. పరాంకుశ రావు తండ్రి గ్రామం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్. ఆయనకు పోస్టుమాస్టర్ గిరి ఓ పార్ట్ టైం జాబ్ లాంటిది . చాలినంత భూవసతి ఉన్న రైతు సోదరుడు
జనవరి నెల ఉదయం ఏడైనా బాలభానుడి నునులేత కిరణాలు భాగ్యనగరం పై ప్రసరించలేదు . నగరం ఇంకా చలిదుప్ఫటి ముసుగులో జోగుతూనే ఉంది . సిక్స్ లైనర్ హైవే - రద్దీ అంతగా లేదు . ఇంతియాజ్ ఫోర్ వీలర్ మెల్లగా ముందుకు సాగుతోంది. అతడి ఆలోచనల అలజడి కారు వేగాన్ని నియంత్రించ గలిగింది ...Read More" ఆపరేషన్ జన్నత్ లక్ష్యం ఏమిటి ? ఈ ప్రశ్న అతడిని ఓ పట్టాన వదలడం లేదు. ఆ రోజు జనవరి పన్నెండు. నేషనల్ యూత్ డే . వివేకానందుని పుట్టినరోజు . ఇంతియాజ్ కారు ఓ కాలనిలో ప్రవేశించింది . కాలనీ లోని కమ్యూనిటీ ప్లేస్ లో వివేకానందుని జయంతి సభ జరుగుతోంది . షామియానా ముందు వివేకానందుని నిలువెత్తు ఫ్లెక్స్ బ్యానర్ అందరి దృష్టిని అయస్కాంతం లా ఆకర్షిస్తోంది . కాషాయి లుంగీ లో చేతులు కట్టుకుని నిశితంగా చూస్తున్న ఆ
శీతాకాలం లో పగలు పన్నెండు గంటల సమయంలో ఎండలో నిలబడగలం . యాదగిరి కాలేజీ మెయిన్ గేటు ముందు ఉన్నాడు . అతడి నిరీక్షణ షేర్ ఆటో కోసం. ఆ వీధిలో సహజంగానే రద్దీ తక్కువ . పైగా మిట్ట మధ్యాహ్నం. యాదగిరి సహనానికి పరీక్షే మరి . ఎట్టకేలకు ఆ పైవాడు కరుణించాడు. ...Read Moreఆటో వచ్చింది. అందులో ఇద్దరే ఉన్నారు . యాదగిరి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు . ఆటో కదిలింది . ఆ వీధి చివర చిన్న కిరాణా కొట్టు ఉంది . కొట్టు ముందు చిన్న పందిరి . ఆ పందిరికి అటూ ఇటూ రెండు పొడుగు బల్లలు . ఒకదానిపై ఓ యువకుడు కూర్చొని యాదగిరి నే గమనిస్తున్నాడు . అతడికి అనుమానం రాకుండా . షేర్ ఆటో రాగానే ఆ యువకుడు మెరుపులా కదిలాడు . తన ప్రక్కనే ఉన్న
విశ్వనాథ శాస్త్రి గారి లోగిలిలో సందడి. అమల కొత్త బట్టల్లో మెరిసిపోతుంది . శాస్త్రి కి , సునీతకు పాదాభివందనం చేసింది. అమల తమ్ముడు ఆనందంతో చప్పట్లు కొడుతూ అక్కను ' హాపీ బర్త్ డే టు యూ' అని అభినందిస్తున్నాడు.అనంత్ రామ్ ( అన్వర్) వారినే కన్నార్పకుండా చూస్తున్నాడు . పెదవులపై చిరునవ్వు. ...Read Moreనీలినీడలు . " అన్నయ్యా " అమల అనంత్ రామ్ పాదాలు తాకింది." నేనా ?" అనంత్ రామ్ ఆశ్చర్య పడి పోయాడు ." ఏం అన్నయ్య చెల్లెల్ని దీవించడా ?" సునీత అనింది.ఆ మాటలకు అనంత్ రామ్ కళ్ళు మెరిసాయి. అక్షింతలు చల్లి అమలు తలను ప్రేమగా నిమిరాడు. జేబులోంచి యాభై రూపాయల నోటు తీసి అమలు చేతిలో పెట్టాడు. " ఈ అన్నయ్య చిరు కానుక". " కానుక విలువ డబ్బు తో కాదు . మనసుతో కొలవాలి." అనంత్ రామ్
నగర శివార్లలో టౌన్ షిప్ అనొచ్చు లేదా కాలనీ అనొచ్చు...మధ్య తరగతి లేదా దిగువ మధ్యతరగతి వారు , ఎక్కువగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతం. చిన్న చిన్న ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటూ, బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు. ఆ ఇరుకు ఢిల్లీ ముందు కారాగింది. కారులోంచి విహారి దిగారు . చాలా టిప్ టాప్ ...Read Moreఖరీదైన గెటప్ లో ఉన్నాడు. హుందాగా నడుచుకుంటూ ఓ చిన్న ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు. ( ఆ ఇంటికి కాలింగ్ బెల్ కూడా లేదు)అతడి వేషం, వాలకం దాదాపు అందరి దృష్టి ఆకర్షించింది, వయోబేధం లేకుండా . ఆ స్థాయి వారు ఆ గల్లీకి రావడం అరుదు. అందుకే అంత టెన్షన్. కొన్ని క్షణాల తర్వాత సగం తలుపు తెరుచుకుంది. విహారి ఏదో అడిగాడు. అవతలి వ్యక్తి చెప్పిన సమాధానం ఇతడి ప్రశ్నకు సరైన సమాధానం కాదేమో విహారి పావు నిమిషం
" నీకు మెహర్ విషయాలు తెలిశాయి. నాకు ఆపరేషన్ జన్నత్ క్లూ దొరికింది. " ఇంతియాజ్ స్వరంలో ఉద్వేగం, ఉత్సాహం. స్పందనగా విహారి నవ్వాడు. " సర్ ! వాటీజ్ అన్వర్ ఫర్దర్ మూవ్ ?" విహారి ప్రశ్న కు వెంటనే వివరణ ఇవ్వలేదు ఇంతియాజ్. ఆలోచిస్తూ ప్రశాంతంగా కూర్చుండి పోయాడు.అన్వర్ హైదరాబాద్ వచ్చి ...Read Moreసంవత్సరం అవుతుంది. ఈ మధ్య కాలంలో తన వాళ్ళను కలిశాడో లేదో . ఒకవేళ కలిసినా తన గురించి నిజం చెప్పాడా ? లేక తన ఉనికి కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాడా ?"" అలాంటప్పుడు మెహర్ ని కలిసే విషయంలో ఆచి తూచిఅడుగెయ్యాలి. ఏం మాత్రం తొందరపడినా మన ప్లాన్ మొత్తం మిస్ ఫైర్ అవుతుంది."" ఎక్జాక్ట్లీ ! అంతేకాదు. ఆపరేషన్ జన్నత్ క్లూ ఛేదించడంలో కూడా జాగ్రత్తగా అడుగు వేయాలి.వారు నడిపేది భయంకరమైన డ్రగ్స్ రాకెట్. మతం ఇచ్చిన మార్ఫియా మత్తు మనిషిని
మెహర్ ఇల్లు చాలా సాదాసీదాగా ఉంది. ఆ చిన్న హాల్లో స్టూల్ మీద కూర్చున్నాడు ఆదిత్య. కాసేపట్లో టీ ప్రేమతో మెహర్ వచ్చింది. ఓం కప్పు ఆదిత్య తీసుకున్నాడు. మరో కప్పు మెహర్ తీసుకుంది.మెహర్ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత అతడి చూపులు హాలు మొత్తం చుట్టాయి. అప్పుడు గోడకు తగిలించిన ఓ ఫోటో ...Read Moreకనిపించింది. ఓం పదహారేళ్ళ అబ్బాయి, పదేళ్ళ అమ్మాయి ఫోటో అది." ఆ అమ్మాయి మీరు. .......ఆ అబ్బాయి....?"" మా అన్నయ్య" మెహర్ ముఖంలో ఏ భావమూ లేదు." అన్నయ్యా ? మీకో అన్నయ్య ఉన్నాడని ఎపుడూ చెప్పలేదే ! " ఆశ్చర్యం గా అడిగాడు ఆదిత్య." ఇల్లు వదిలి వెళ్ళి పోయి పదిహేను సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉన్నాడో ? ఏం చేస్తున్నాడో ? తిరిగి రాని వాడి గురించి ఏం చెప్పేది ?" మెహర్ మొహంలో దైన్యం."ఇల్లు వదిలి అంత చిన్న వయసులో
" బాగా సంపాదించాలన్న కోరిక కదా ఏ గల్ఫ్ కంట్రీ కో వెళ్ళుంటాడు."." అయుండొచ్చు. డబ్బు యావలో పడ్డవాడికి మేము గుర్తొస్తామా ? అందుకే తిరిగి రాలేదు. ఆమె నటించటం లేదు. నిజంగానే అన్వర్ వీళ్ళను కలవలేదు.విశాలమైన ఆ కాలేజీ రిసెప్షన్ హాల్లో విజిటర్స్ ఛెయిర్ లో కూర్చుని ఉన్నారు విహారి, మెహర్. " ...Read Moreగుర్తుకు రానప్పుడు నేనేం ఉంటాను ? నాకు తెలిసి నేను, మీ అన్నయ్య నాలుగైదు సార్లు కలిసి ఉంటాం. . నా రూపం ఎప్పుడో జ్నాపకాల్లోంచి చెదిరి పోతుంటుంది. నన్ను మరిచిపోయుంటాడు. మీరు గుర్తు చేసినా ఫలితం ఉండదు. " విహారి చాలా జా
అక్కడి పరిస్థితి చూశాక మా వాడికి విషయం అర్థమైంది. వాళ్ళిద్దరూ దారుణంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అందుకే ప్రతి శనివారం డిన్నర్ కు రావటం లేదు. మావాడి తల తిరిగి పోయింది. మరునాడు సమయం చూసుకుని పవన్ ను నిలదీశాడు. వాడికి ఒప్పుకోక తప్పింది కాదు. విశాల్ వల్ల డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ...Read Moreవిషయం ఎవరికీ చెప్పొద్దని ఏడుస్తూ చేతులు పట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ కు . అసైలం లో చేరి అలవాటు మానుకుంటానన్నాడు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనిఅడిగితే వివరాలు చెప్పలేదు. వాడి కళ్ళల్లో భయం కనిపించింది. ఆ పైన మా వ
ఈ అటాక్ లో మూడు వందల కన్నా కాస్త ఎక్కువే మిలిటెంట్లు చనిపోయారు. ఇదెలా సాధ్యం ? ఆర్మీ పర్సనల్ అంత కచ్చితంగా వారి ట్రైనీ క్యాంప్స్ ను ఎలా లొకేట్ చేయగలిగారు? ఆ స్థావరాల టోపోగ్రఫీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండాలి."" ఆ వ్యక్తి అలీ కాదు గదా ! ...Read Moreలో చిన్న ఆశాకిరణం.అలీ జీవించి ఉన్నాడన్న ఆలోచన అన్వర్ మనసును తేలిక పరిచింది. ఏమాత్రం సందేహం లేదు. అలీ సహకారం లేనిదే ఈ ఆపరేషన్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయితే ఛాన్సే లేదు. ఇప్పుడు అలీ తన గ్రామం లో తన వాళ్ళతో కలిసి ఆనందంగా కబుర్లు చెబుతూ ఉంటాడు.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు......... అన్వర్ మనసు లో ఊహ.కానీ ఆ ఊహ తప్పదు. సర్జికల్ స్ట్రైక్ లో అతడి సహకారానికి ప్రతిఫలం గా on compassionate and grounds అతడిని ఆర్మీ లో