నీడ నిజం - 33

  • 2.3k
  • 882

‘రాహుల్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి విద్యాధర కళ్ళు అత్తగారి కోసం అన్వేషిస్తున్నాయి . అక్కడ దిగిన గంట లోనే నాలుగు సార్లు రాహుల్ కు గుర్తు చేసింది . రాహుల్ నిస్సహాయం గా భరత్ రామ్ ను చూశాడు . అతడి బాధ ఆయనకు అర్థమైంది . “ విద్యా ! మీ అత్తగారిది పెద్ద వయసు కదా ? విశ్రాంతి గా పడుకొని ఉంది . రేపు ఉదయం స్థిమితం గా చూడవచ్చు . నువ్వు ఈ రాత్రి రెస్ట్ తీసికో ‘” అత్తా- కోడళ్ళ సమావేశం చాలా కీలకమైంది . విచిత్రమైన పరిస్తితుల్లో చాలాకాలం తర్వాత కలుస్తున్నారు . కలిసిన క్షణం లో వారిద్దరి భావోద్వేగం ఊహకందని స్థాయి లో ఉంటుంది . అందుకు పెద్దావిడను సిద్ధం చేయాలి . ఆవిడ రాత్రి పూట ఓ పెద్ద గ్లాసు నిండా పాలు తాగుతుంది . మరేమీ తీసుకోదు