నీడ నిజం - Novels
by LRKS.Srinivasa Rao
in
Telugu Fiction Stories
హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది .
గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో దైన్యం , మొహం ...Read Moreసఘన విషాదం .
ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి.
“ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి ?” వృద్ధుడి కంఠంలో రవ్వంత విస్మయం , వినోదం.
“ గురుదేవా ! ఇది అవ్యక్తం కాదు . మన ఇద్దరి మధ్య తీగె లా అల్లుకున్న అనుబంధం. ఈ సమస్త సృష్టికి మూలం. పరాత్పరి ప్రేమ తత్త్వం. ఆ ప్రేమ రాగాత్మక భక్తీ భావన కు చరమ లక్ష్యం కాదా ? భక్తీ తో అభిషిక్తం కాని జ్ఞానం ఎందుకు ? ఎవరి కోసం ? ప్రేమ హృదయం లో ఉప్పొంగే సహజ భావన.అమృతధార.మన గురు శిష్య సంబంధం ఆ ప్రేమ తత్వానికి అతీతం కాదు. ఇన్నేళ్ళ మీ సాహచర్యం నాకెన్నో అనుభవాల్ని మిగిల్చింది. నన్నొక సాధకుడిని చేసింది. పడవ ప్రమాదం లో నా వాళ్ళందరిని పోగొట్టుకున్నాను. . ఒంటరిగా మిగిలాను. మీ పరిచయం కాకపొతే నా జీవితం కూడా గంగ పాలయ్యేది. నన్ను చేరదీసారు. ఆదరించారు. జ్ఞాన బోధ చేసి స్వ స్వరూప జ్ఞానం కలిగించారు.నా సాధన, సంయమనం, స్ఫూర్తి మీరు పెట్టిన బిక్ష. మీరు పరిచయం కాకుంటే నా అస్తిత్వం మహా శూన్యంలో కలిసిపోయేది.మరి ఈ సాహచర్యం
నీడ-నిజం నాంది హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో ...Read More, మొహం లో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి
రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి స్థితి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో మెరుపు లాంటి “ సంకేత”మొకటి తళుకుమంది . ఆ సంకేతం అతడిని వైకుంఠ ...Read Moreనాడు తిరుమలకు చేర్చింది . పవిత్ర వైకుంఠ ధామం చేరి , శ్రీనివాసుని ధ్యానించి , సాయం సంధ్య లో బంగారు శిఖరాల వైభవాన్ని , విమాన గోపుర పసిడి కాంతులను అవలోకించే చిన్మయానండు డికి గుదేవుడి భవిష్యవాణి తేటతెల్లమైంది. సందేహాలు సూర్యకాంతి సోకినా పొగమంచులా విడిపోయాయి.”కర్తవ్యం “ స్ఫురించింది.ఆ పవిత్ర క్షేత్రం లోనే అతడు విద్యాధరిని చూడటం తటస్థించింది .విద్యాదరి తండ్రికి భవిష్యవాణి” వివరించింది అక్కడే ! ఆ తిరుమల గిరిలోనే .అప్పుడు విద్యాధరికి పదేళ్లు. తెలిసీ తెలియని ఊహ. వయసు. చిన్మయానంద
తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి పై ప్రేమ ,"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ పని మానుకోలేదు . వేరే కొత్త వెంచర్ ప్లాన్ చేసాము . పేపర్ ...Read Moreజరుగుతున్నప్పుడు పెద్దగా నాకు పని ఉండదని ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ టేకప్ చేశాను . ఈ లోపలే మన న్యూ వెంచర్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది . పని ప్రారంభించాము . అందుకే ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించాను .అప్పుడప్పుడు సూపెర్వైస్ చేస్తే చాలు . .... ఈ విషయాలన్నీ నీకు తెలుసు . తెలిసి కూడా ఎందుకంత ఎమోషనల్ గా నన్ను అరుస్తావ్?”అతడు చెప్పిన కారణం విద్యాధరిని సమాధాన పరచ లేకపోయింది . ఆమె అసహనం గా
.ఒకసారి సిటీ లో ఉగ్రవాదం పై ఒక సదస్సు జరిగింది. రెండు మతాలకు వేదిక లాంటి ఆ నగరం లో ప్రజల మధ్య సమన్వయం, అవగాహన పెంచే లక్ష్యం తో ఒక ఎన్.జీ.ఓ ఆ సదస్సు నిర్వహించింది . అప్పట్లో విధ్యాదరి ఓ పాపులర్ డైలీ లో ఓకే ప్రత్యెక కాలం నిర్వహించేది . ...Read Moreదిన పత్రిక తరపున సదస్సుకి ఆహ్వానింప బడింది . సదస్సుకు ముఖ్య అతిథి సాగర్. ఆ ఎం.జీ.ఓ మహారాజ పోషకుడు. అ సందర్భం లో విద్యాధరిని చూడడం , మాట్లాడటం జరిగింది . ఎందఱో ఉగ్రవాదం పై విభిన్న కోణాల్లో మాట్లాడారు . విద్యాధరి కూడా మాట్లాడింది . అందరితో పోలిస్తే ఆమె భావాల్లో సమస్య పై మరింత స్పష్టత, ఇరు మతాల వారికీ అనుకూలమైన ఆలోచనలు , అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె భావాలూ సదస్సులో చాల మందికి నచ్చాయి . నిజం చెప్పాలంటే
అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. కారణానికి అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని తర్కించి, నిజానిజాలు నిగ్గు తేల్చే మీరు ఈ అనంత సృష్టికి ఒక మహత్తరమైన ...Read Moreఉందని ఎందుకు ఒప్పుకోరు. ఈ మహా విశ్వం లో అనంత కాలం నుండి వాటి వాటి నిర్దిష్ట కక్ష్యల్లో క్రమం తప్పకుండా పరిభ్రమించే కోటానుకోట్ల గ్రహ నక్షత్రాలు , మరణించే వరకు లయ తప్పని గతిలో స్పందిచే మానవ హృదయం. వీచే గాలి వికసించే పుష్పాలు వీటన్నిటికి ఏ కారణం లేదా అన్నింటి కన్నా మీ నవీన విజ్ఞానాని కన్నా అద్భుతమైనది మనసు. ------అంత అద్భుతమైన మనసును భగవంతుడు మానవ శరీరం లో అమర్చాడు. ఈ అనంత విశ్వం లోనే మానవుడిది అత్యుత్తమమైన సృష్టి.
ఇప్పుడు ఆమె కలల్లో అస్పష్టత తొలగి, కొన్ని స్పష్టమైన రూపాలు , ప్రదేశాలు కనిపించసాగాయి. అ వివరాల ప్రకారం ఆమె మనసులో మెదిలే ప్రదేశాలు, పరిసరాలు, భౌగోళిక స్వరూపం రాజస్థాన్ రాష్ట్రానివని భరత్ రామ్ గుర్తించాడు. విశాల రాజస్థాన్ లో ఆమె వర్ణించే ప్రదేశాలు ఎక్కడని వెదకటం ? వెంటనే భారత్ రామ్ కు ...Read Moreరాజస్థాన్ మిత్రుడు గుర్తుకొచ్చాడు.అతడే శాంతిలాల్ .వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. రాజస్థాన్ లో మూల మూల పరిచయం వుంది. భరత్ రామ్ అతడిని సంప్రదించాడు. విద్యాధరి కధనం సాంతం విన్నాక శాంతిలాల్ మనసులో రెండు ప్రదేశాలు మెదిలాయి. అ రెండు ప్రదేశాలు గ్రామీణ వాతావరణం లో ఉన్నవే. భరత్ రామ్ అన్ని కోణాల్లో సమస్యను పరిశీలించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. అయన సూచన ప్రకారం సాగర్, విద్యాదరి ఒకసారి రాజస్థాన్ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాలి. ఇందువల్ల విద్యాధరి సమస్యకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది.
అ గ్రామం లో గాలి దుమారం లా పరుగులు తీసి ఊరికి మరో చివరికి వచ్చింది. అక్కడ రాజమహల్ లా కనిపించే ఒక భవనాన్ని చూసి కదిలిపోయింది. బాధ, భయం, ఉద్వేగం, ఉద్రేకం- ఒక్కసారి కలగలిసి సాగర్ర కెరటాల్లా ఆమె ను చుట్టూ ముట్టాయి.ఆ తాకిడికి తట్టు కోలేక స్పృహ తప్పింది. సుదర్శనం డాక్టర్ ...Read Moreఆమె రక్షణ బాధ్యత తీసుకున్నాడు.వెంటనే అందరూ తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎవరి ధ్యాసలో , ఆలోచన లో వారుండి పోయారు.విద్యాధరి రాక, ప్రతి కదలిక గ్రామ వాసుల్లో కలకలం, కలవరం రేపాయి. ఆమె ఏనాడో గతించిన "కోమలా దేవి" అన్న నిజం వారికీ అసలు మింగుడు పడలేదు. ఈ అద్భుతం వారికి దైవ ఘటనగా తోచింది. ఆమె దైవాంశ సంభూ తురాలు అన్న భావన వారి మనస్సులో బలం గా నాటుకుంది. ఎవరికీ తో చిన విధం గా వారు
రాహుల్ కోమల కు దూరంగా ఉన్నాడు. చెరువు గట్టు మీద పచార్లు చేస్తున్నాడు. గట్టు మీద నడుస్తున్న రాహుల్ కు చెరువు లో ఒక మూల ఎర్ర తామరలు కనిపెంచాయి. వాటిని చూడగానే కోయాలనిపించింది. తెలిసీ-తెలియని వయసు ,ఉరకలు వేసే ఉత్సాహం -ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దిగాడు. చివరి మెట్టుపై పేరుకు పోయిన ...Read Moreమొక్కలు రాహుల్ కాలుజారి చెరువులో పడేలా చేసాయి. అంతే భయం తో రాహుల్ పెట్టిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. రాహుల్ నీళ్ళలో పడిన చోట లోతు ఎక్కువ. అందుకే నేల అందక నీళ్ళపై గిలగిల కొట్టుకుంటున్నాడు. క్షణాల్లో పరిస్థితి విషమించింది. ఎవరో ఒకరు సాహసం చేయకపోతే ఓ పసి ప్రాణం నీటి పా లవుతుంది. కోమల క్షణం ఆలస్యం చేయలేదు. మొండి ధైర్యం తో చెరువులో దూకింది.గట్టు మీద ఆడవాళ్ళు ‘జాగ్రత్త,జాగ్రత్త’ అని అరుస్తున్నారు. ఎలాగో ప్రాణాలకు తెగించి కోమల రాహుల్ ను