రక్తపు రుణం

  • 171
  • 69

అది ఊరి చివరన ఒంటరిగా ఉన్న ఒక పాతకాలపు పెంకుటిల్లు. గోడల నిండా నాచు పేరుకుపోయింది. గాలి వీచినప్పుడల్లా ఆ ఇంటి కిటికీలు విచిత్రమైన శబ్దాలు చేసేవి. ఆ ఇంట్లో సూర్య, చేతన్, విక్కీ, రాఘవ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. ఊళ్ళో వాళ్ళ పేరెత్తితేనే జనాలు దూరంగా జరిగేవారు. ఎలాంటి పనిపాటా లేకుండా, రోజంతా తాగుతూ అల్లరి చిల్లరగా తిరగడమే వారి దినచర్య.ఒక అమావాస్యకు దగ్గరగా ఉన్న చీకటి రాత్రి, ఇంట్లో తాగడానికి చుక్క మందు కూడా లేదు. అప్పుడు విక్కీ అన్నాడు, రేయ్, పక్కనే ఉన్న గౌడ గారి తోటలో ఈసారి సీతాఫలాలు, కొబ్బరికాయలు బాగా కాశాయి. ఈ టైమ్‌లో అక్కడ ఎవరూ ఉండరు, వెళ్ళి పట్టుకొద్దాం రండి. నలుగురూ తోట వైపు అడుగులు వేశారు.తోటలో దొంగతనం చేస్తుండగా, హఠాత్తుగా వారిపై టార్చ్ లైట్ వెలుతురు పడింది. ఎవరా దొంగలు? అని గంభీరమైన గొంతుతో అరుస్తూ, తోట యజమాని