ఆనందరావు నగరంలోని కోటీశ్వరులలో ఒకరు వ్యాపారంలో బాగా సంపాదించాడు. తన బావమరిది సబ్ ఇన్స్పెక్టర్గా ఆనగరంలోనే పనిచేస్తున్నాడు తన తమ్ముడు ఒక లాయర్ తన బంధువులు కూడా మంచి ధనవంతులు ఆనందరావుకు సంఘంలో మంచి పేరు కలదు. ఆనందరావుకు మాట వినే భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురి వివాహం తన స్నేహితుడైన జగన్మోహన్ గారి కుమారుడైన ఆర్యతో నిశ్చయించారు పెళ్ళికి రెండు రోజుల సమయం ఉంది ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి ఇంటి బయట కూడా డెకరేషన్ పనులు జరుగుతున్నాయి దాదాపు 30 మంది పెళ్లి పనుల్లో ఉన్నారు.
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 1
కార్తీక్ ఒక హత్య చేసి జైలుకు వెళ్లి వస్తాడు.అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు, అయితే ఆ అమ్మాయి పెదనాన్న ఆస్తి కోసం తనని కార్తీక్ ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? తన జీవితంలోకి వచ్చిన కొత్త ప్రేమ ఎవరు? లాంటి మలుపులతో సాగుతుంది ఈ నవల. ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 2
సమయం ఆరు గంటలు... గడిచిపోయాయి.పోలీసులు, ఆనందరావు మనుషులు నగరమంతా వెతికినా కార్తీక్, సుమ ల ఆచూకీ తెలియ రాలేదు. కిడ్నాపర్లు సుమను తీసుకువెళ్లే సమయంలోనే సుమ ఫోను ఎక్కడో పడిపోయింది, కావున ఎటువంటి సమాచారం లేదు. ఇంత లోపల ఆనందరావు బావమరిది రాజారావు మరియు అతని కూతురు సత్యభామ కూడా వచ్చారు. సత్య సుమ కంటే మూడేళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోలేదు. సత్య తన తండ్రి మాట ఎప్పుడూ వింటుంది కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎవరి మాటా వినడం లేదు. ఎందుకో పెళ్లి చేసుకోవడం లేదు. సత్యకు అందం, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎందరో పెళ్ళికొడుకులు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా సత్య వారందరినీ తిరస్కరిస్తూనే ఉంది.ఆనందరావును సుభద్రను ఓదారుస్తూ ఉండగా.. పనిమనిషి హేమ పరిగెత్తుకుంటూ వచ్చి, సుమ వస్తోంది అని చెప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందరావు, సుభద్ర, సురేంద్ర సుమకు ఎదురుగా వెళ్లి, " ఇంతసేపు ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 3
అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆనందరావు, సత్య కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అది నగరంలోనే ఖరీదైనది మరియు ధనవంతులు వెళ్లేది. వారు వెళ్లే దారిలో కార్తీక్ కనిపించాడు. చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతను సూట్ ధరించి ఉన్నాడు. కార్తీక్ చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. ఆనందరావు కార్తీక్ ను పలకరించగానే సూటు ధరించిన వ్యక్తి, కార్తీక్ వైపు చూసి వెళ్తాను అన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోయాడు. ఆనందరావు, సత్యలు కార్తీక్ ఎదురుగా కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయిపోయాక ఆనందరావు " కార్తీక్ ఎలా ఉన్నావు? గాయం తగ్గిందా? ఇక్కడ ఎవరి కోసం వచ్చావు? ఆయన ఎవరు? " అని అడిగాడు. అప్పుడు కార్తీక్, " గాయం చాలా వరకు తగ్గిపోయింది. సుమ బాగానే ఉంది కదా? తెలిసిన మనిషితో మాట్లాడడానికి వచ్చాను "అని చెబుతుండగా.... ఆనందరావు ఫోన్ మోగింది. "ఇది ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 4
ఆనందరావు, " చూడు కార్తీక్! నీ గతం గురించి వినాలనుకుంటున్నాను. ఎందుకో నువ్వు హంతకుడువని, స్వయాన నా బావమరిది కొడుకును చంపావని తెలిసినా నాకు నీ కోపంగాని ద్వేషం గానీ రావడం లేదు. నేను నీకు తండ్రి లాంటి వాడిని. నా కోసమైనా ఏం జరిగిందో చెప్పు" అని బతిమాలుతూ అడిగాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని సుమా సత్య కూడా ఎదురు చూడ సాగారు.కార్తీక్ మెల్లగా లేచి నడుచుకుంటూ దగ్గరిలోని కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలబడ్డాడు. కంటిలో నుండి సన్నగా ధారగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వాటిని దిగమింగుకొని, గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు..."నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న మాత్రమే ఉండే వాళ్ళం. మాది చాలా చిన్న ఫ్యామిలీ మరియు సంతోషకరమైన ఫ్యామిలీ. ఎప్పుడూ మా ఇంట్లో అమ్మకు, నాన్నకు ఎలాంటి గొడవలు లేవు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 5
గురునాదం మాస్టర్ ఎవరికోసమో వచ్చారు అనుకొని నా పనులు చేసుకుంటున్నాను. నేను స్కూలుకు వెళ్లే రోజుల్లో, సార్ పాఠం చెబుతుంటే పిల్లలందరూ పాఠం వినకుండా అల్లరి వాళ్ళు, ఆడుకునేవాళ్లు అయినా మాస్టారు కోప్పపడకుండా పాఠం పీరియడ్ అయిపోయే వరకు చెప్పి వెళ్లేవారు. ఆయన ముఖంలో ఏనాడు చీకాకు గాని, కోపం గాని చూడనే లేదు. దాదాపు 55 సంవత్సరాల వయస్సు ఉంటుంది."కార్తీక్ "అనే పిలుపుతో తల ఎత్తి పైకి చూశాను. "నమస్తే సార్" అని పలకరించాను. కుర్చీ వేశాను..కుర్చీలో కూర్చుని, "ఎలా ఉన్నావు, కార్తీక్? స్కూలుకు రావడం లేదు ఎందుకు?" అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాను. అంతా విని, "నేను నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. జీవితంలో గుర్తుపెట్టుకో! చదువును కొనసాగించు. చదువు కోసం నువ్వు స్కూలుకు రానవసరం లేదు. పని చేసుకుంటూనే పుస్తకాలు తీసుకొని రాత్రిపూట చదువుకో! ఏమైనా అనుమానాలు ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 6
ఆనందరావుకు దిమ్మ తిరిగిపోయింది. ఎవరినైతే జీవితాంతం ద్వేషించి, అతనికి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడో అతను మళ్ళీ తన జీవితంలోకి దుర్మార్గుడైన హరిచంద్ర ప్రసాద్ మరలా ప్రవేశించాడు. ప్రసాద్ లాంటి నీచుడు, దుర్మార్గుడికి కార్తీక్ తో సంబంధం ఏమిటి? ఎందుకు హరిచంద్ర ప్రసాద్ కొడుకుని చంపాడు?. హరిచంద్ర ప్రసాద్ కార్తీక్ ను ఎందుకు చంపాలని తీర్మానించాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.సరే కొన్ని రోజులు కార్తీక్ దూరంగా ఉంటే మంచిది అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆనందరావు టిఫిన్ తింటుండగా... సత్య, సుమ వచ్చారు. వారు కూడా టిఫిన్ చేశారు తర్వాత ఆనందరావ్ ఆఫీస్ కు బయలుదేరుతూ.. సత్య ను కూడా తీసుకొని వెళ్ళాడు.దారి మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చింది. దాంతో దగ్గరలోని మెకానిక్ షాప్ కు తీసుకొని వెళ్ళారు. అందులో ఒక వర్కర్ వచ్చి కారును చెక్ చేస్తున్నాడు... అంతలో మెకానిక్ షాప్ ఓనర్ వెళ్తూ "అబ్దుల్లా ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 7
కార్తీక్ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. తల గాయానికి కట్టు కట్టారు. ఎదురుగా అబ్దుల్లా ఉన్నాడు. అబ్దుల్లా పక్కన పోలీసులు ఉన్నారు. వారిలో ఎస్సై రాందేవ్ ఉన్నాడు.రాందేవ్, " నీ పేరు ఏమిటి? " అని అడిగాడు." కార్తీక్ సార్ "అని బదులిచ్చాడు." నీ ప్రాణాలకు తెగించి చిన్నపిల్లలను చాలామందిని కాపాడావు. గ్రేట్ జాబ్. వెరీ గుడ్... " అని మెచ్చుకున్నాడు." ఏం చేస్తుంటావ్? " అని అడిగాడు.కార్తీక్... జైలర్ ఇచ్చిన లెటర్, కాండక్ట్ సర్టిఫికెట్ చూపాడు. అది చదివిన ఎస్ఐ, "వాట్ ఈరోజే జైలు నుంచి వచ్చావా?" అంటూ ఆశ్చర్యపోయాడు."ఎనీ హౌ బీ కేర్ ఫుల్. చిన్న దెబ్బనే. ఒక గంటలో డిశ్చార్జ్ చేస్తారు. నువ్వు వెళ్ళిపోవచ్చు" అని చెప్పి వెళ్ళిపోయాడు.ఒక గంట తర్వాత కార్తీక్ కు మాత్రలు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించేశారు హాస్పిటల్ వాళ్ళు.కార్తీక్, అబ్దుల్లా బయటికి రాగానే అబ్దుల్లాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 8
పోలీస్ కానిస్టేబుల్ కార్తీక్ ఫైలు తీసుకుని నిరాశగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అక్కడ చైన్ పోయిన అమ్మాయి, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఎస్సై రాందేవ్ కానిస్టేబుల్ చూసి, " ఏంటి సుబ్బారావు.. చైన్స్ నేచర్ ఎక్కడ? గొలుసు ఏది?" అని ప్రశ్నించాడు." చైన్స్ నేచర్ బైక్పై పారిపోయాడు సార్ "అని చెప్పగా...." సరిపోయింది. వాడి వివరాల ఆధారంగా స్కెచ్ వేయించు. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని పంపించి వెయ్, అంతకుమించి ఏం చేయగలంలే. విలేకరులు మన గురించి పేపర్లలో రాస్తారు. మనం పై అధికారులకు సంజాయిషి ఇవ్వాలి. వారు తృప్తి చెందితే సరే! లేదా మనపై చర్య తీసుకుంటారు" అంటూ... సుబ్బారావు చేతిలోని ఫైల్ పరిశీలించి తీసుకున్నాడు.అందులో కార్తీక్ సర్టిఫికెట్లు, జైలు నుంచి విడుదల లేఖ, జైలర్ రాసిన రికమండేషన్ లేఖ,కాండక్ట్ సర్టిఫికెట్ చూసి, " ఇవి ఎవరివి, నీకు దొరికాయా?" అని అడిగాడు." లేదు సార్! ఒక ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 9
దుర్గాప్రసాద్ వెంటనే ఫోను తీసి ఒక నెంబర్ కు డయల్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తగానే, "ఏంటి భుజంగం గారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. నా వరకు వచ్చింది "అంటూ వెహికల్ నెంబర్ చెప్పాడు. అవతల వైపు నుంచి," మేము ఇలాంటి చిల్లర పనులు చేయము, కానీ ఆ నెంబర్ వెహికల్ మాత్రం నా అనుచరుడు సూరిగానిదే. ఏవైనా చిల్లర డబ్బులకు ఆశపడి చేసి ఉంటాడు. ఇందులో నాకు గాని, మా తండ్రికి గానీ సంబంధం లేదు. వాళ్లకు డబ్బులు ఇచ్చి అమ్మాయిని విడిపించుకోమని చెప్పండి. అమ్మాయికి మాత్రం ప్రా ణభయం ఉండదు "అంటూ ఫోన్ పెట్టేశాడు.దుర్గాప్రసాద్ కానిస్టేబుల్ తో" నగరంలో నిన్న కానీ ఈరోజు కానీ ఏవైనా కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయేమో కనుక్కోండి "అనడం కార్తీక్ వింటూ నడుస్తున్నాడు...ఇక లాభం లేదనుకొని ఎస్ఐ రాందేవ్ కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. వెంటనే పోలీస్ ...Read More
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 10
ఎస్సై రాందేవ్, "లోపల ఇంకా ఎవరైనా ఉన్నారేమో సెర్చ్ చేయండి "అంటూ కార్తీక్ ను కానిస్టేబుల్ లను ఆదేశించాడు. కొద్దిసేపటి తర్వాత కానిస్టేబుల్స్ మూడు పెద్ద తీసుకొని వచ్చారు. వాటిని ఓపెన్ చేసి చూడగా అందులో కొత్త డబ్బు కట్టలు ఉన్నాయి. దాదాపు మూడు కోట్ల రూపాయల డబ్బు దొరికింది. రాందేవ్ కు ఇవి నకిలీ నోట్లో ఏమో అన్న అనుమానం వచ్చింది. ఇంతలో కొన్ని వెహికల్స్ లో కొందరు, బైకులపై కొందరు ఆ స్పాట్ కు వచ్చారు. వాళ్లందరూ జర్నలిస్టులు. వారు వచ్చి రాగానే కెమెరాలు ఆన్ చేసి, ఆ ప్రదేశమును అంతా లైవ్ లో చూపించసాగారు. పోలీసులు పట్టుకున్న నిందితులను, డబ్బుల సంచులను చూపిస్తున్నారు. అసలు వీళ్లకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? అంటూ ఎస్సై రాందేవ్ ఆలోచిస్తుండగా... దూరం నుంచే కానిస్టేబుల్ సుబ్బారావు తన రెండు చేతులు జోడించి, తన కూతురు కిడ్నాప్ విషయం మీడియా ముందు ...Read More