తొలి పౌర్ణమి

(0)
  • 120
  • 0
  • 5.5k

మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. **** సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు. “ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు. గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా.. సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా.. “అలగా మరి టాస్ అయ్యిందా..” హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..

1

తొలి పౌర్ణమి - 1

మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ****సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు.“ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు.గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా..సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా..“అలగా మరి టాస్ అయ్యిందా..”హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..“సరే వాసు” అంటూ కొత్త గ్రిప్పర్ ను బ్యాట్ కు తొడిగి, బరిలోకి దిగా..నా జట్టులో నేను, వాసు; అవతలి జట్టులో ఆకాశ్‌, విజయ్ ఉన్నారు, మిగతా వాళ్లంతా నాకు ...Read More

2

తొలి పౌర్ణమి - 2

నువ్వు లేకుండా ఎలా, కచ్చితంగా తీసుకునే వెళ్తా..“మావ ఎక్కడి కన్నా టూర్ వెళ్దామా”, అడిగాడు జయ..రేయ్ టూర్ అన్నావంటే ఇక్కడే బండాపి మరి తంతా..నేనే మన్నా 15 సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసావ్, ఇంటికి వెళ్లొచ్చాక చూద్దాం..సరే మావ.., బండాపు…ఎందుకురా…మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ సిల్క్ బోర్డు నుంచే బస్ ఎక్కాలి, అన్నాడు జయ.రేయ్ ఇక్కడి నుంచి మళ్లీ 15 కిలోమీటర్లు నేను ఒంటరిగా వెళ్లాలిరా నాతో పాటు వచ్చి మమ్మల్ని ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ వద్ద దింపి నువ్వు నా బండి తీసుకెళ్ళు, నీ బైక్ ని రిపేర్ కి ఇచ్చావ్ గా..ఓరి పిచ్చోడా… నువ్వు ఇంకా ఆలోచనలు మానుకోలేదా.., అయినా ఎన్నిసార్లు చెప్పాలి రా “నీ గతం, నీ తప్పు కాదు అది ఒక పొరపాటు.., లేదా విధి అంతే..”.నేనేం చెయ్యను అది నన్ను విడిచిపెట్టట్లేదు.., అయినా నేను చేసిన పొరపాటు సరిచేసే అవకాశం ...Read More

3

తొలి పౌర్ణమి - 3

పసిడి వన్నె అంచున్న చున్నీ తళుక్కున మెరవగానేవిక్రమ్ చూపు అటువైపు మళ్లింది.తెల్లటి చూడీదార్ వేసుకొని,ముంగురులపై వేళ్లను సవరిస్తూ,బస్సు చివరి మెట్టును దిగుతున్న ఆ అమ్మాయి,రాత్రి దీపాల తేలిపోయే మృదువైన కాంతిలా కనిపించింది.ఆ కలువరేకులాంటి కనులు అతని చూపును తాకిన క్షణం,ఉప్పెనలా ఎగిసిపడిన మనోభారం ఒక్కసారిగా తగ్గి, ప్రశాంతత అలముకుంది.ఆమె వైపు చూపు మళ్లగానే,ఒక్క క్షణం ప్రపంచమంతా మసకబారిపోయింది…కానీ తను మాత్రం ఎంతో స్పష్టంగా, హృదయానికి దగ్గరగా కనిపిస్తోంది.అలా, విక్రమ్ మనసులో ఓ తీపి అలజడి మొదలైంది” “ఆ అమ్మాయి ఏదో మర్చిపోయినట్టుంది, మళ్ళీ బస్ లోపలికి వెళ్ళింది..కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆమె కోసం వెతుకుతున్నాడు విక్రమ్..విక్రమ్ తలను ఎవరో కుడివైపు తిప్పారు, చూస్తే జయ“ ఏంట్రా ఊగిపోతున్నావ్ చలిగా ఉందా…”పోరా నువ్వు ఒకడివి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు, అంటూ మళ్ళీ తన కోసం ఎదురుచూడసాగాడు.“ ఏంటబ్బా వీడు, ఎప్పుడూ లేనిది కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు “, ...Read More

4

తొలి పౌర్ణమి - 4

హేమ వెంటనే విక్రమ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, “కళ్ళు నెత్తి మీద ఉన్నాయా నీకు, నేను ఇంతసేపు కష్టపడి కట్టినదంతా కూల్చేశావు” అంది.. అమ్మాయి అలా అరవడం మొదటిసారి చూస్తున్నాడు విక్రమ..నువ్వు పిలిస్తే పలకలేదు, కంగారుగా వస్తున్నప్పుడు నా కాలికి తగిలిన రాయి వాటిని పడేసింది, ఇందులో నా తప్పు ఏముంది అన్నాడు విక్రమ్.నా పనిని చెడగొట్టింది గాక, ఇంకా నిన్ను సమర్థించుకుంటున్నావా.ఓ కట్టావులే! ఐఫిల్ టవర్.నేను ఐఫిల్ టవర్ కడతానో లేదా మొబైల్ టవర్ కడతానో నీకెందుకు, ఇంతకీ ఎందుకు వచ్చావు మా ఇంటికి అంది హేమ.నీకోసమేం కాదు లే, నేను ఆకాష్ కోసం వచ్చా అన్నాడు గట్టిగా..ఆకాష్ లేడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు…అది ముందే చెప్పుంటే అక్కడినుంచే వెళ్ళేవాడిని గా, నీతో ఇన్ని మాటలు పడే అవసరం ఉండేది కాదు..మళ్ళీ సీరియస్ గా చూసింది హేమ..నేను వెళ్తా వాడొచ్చినప్పుడు చెప్పు..ఎక్కడికీ వెళ్ళేది, ...Read More

5

తొలి పౌర్ణమి - 5

ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని బైక్ ను పైకి లేపాడు,ఇంతలో వెనకనుంచి ఎవరో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకున్నారు, “ఆ చల్లటి గాలిలో చమటలు పట్టాయి”. వెనక్కి తిరిగాడు, అది ఎవరో కాదు తన కలలో వచ్చిన ఆకాష్.కలలో భయపెట్టిన ఆకాష్ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఆ రోధన చాలా భయంకరంగా ఉంది.“ రేయ్.. ఎందుకురా నన్ను చంపావు…. చెప్పు! చెప్పరా….. “విక్రమ్ భయం అంచులు దాటింది, బైక్ కిందకు వదిలేసాడు..“రేయ్ నేను ఏది కావాలని చేయలేదు రా!!..”“లేదు .. నువ్వు కావాలనే చేశావు” అంటూ అరిచాడు ఆకాష్..నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా “నేనేది కావాలని చెయ్యలేదు”..అంటూ ఆకాష్ కి సమాధానం చెప్పే క్రమంలో విక్రమ్ కూడా బాధపడుతున్నాడు..“రేయ్ విక్రమ్! ఏమైంది రా నీకు, రాత్రిపూట ఒక్కడివే మర్రి చెట్టు కింద పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నావ్” అని వినిపించింది… విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తాతయ్య ఆలస్యం అయ్యేసరికి ...Read More

6

తొలి పౌర్ణమి - 6

విషయం తెలిసిన సూర్య అక్కడికి వచ్చాడు, సూర్య మీదకి ఆవేశంగా వెళ్ళాడు రమణ. “నీ కొడుకుని రెచ్చగొట్టి పంపించి నా కొడుకుని చంపావు కదరా!!” అంటూ పట్టుకున్నాడు.అది కాదు రమణ అదేదో పొరపాటున జరిగిపోయింది ఎవరైనా కావాలని ఇలాంటి పనులు చేస్తారా చెప్పు..ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నీ కొడుకుని సమర్థించుకుంటున్నావ్…, నీకు కొంచెం కూడా బాధగా లేదా, అంటూ కాలర్ పట్టుకున్నాడు రమణ..మాటకు మాట పెరిగి గొడవ పెద్దదవుతోంది చుట్టుపక్కల వాళ్లంతా ఇది సమయం కాదు అంటూ సర్ది చెప్పి సూర్యను ఇంటికి పంపారు.విక్రమ్ నాన్నతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు, అలా వెళ్తున్నప్పుడు హేమ మళ్ళీ ఇంకొక చూపు చూసింది, ఆరోజు కృతజ్ఞతగా చూస్తే, ఈరోజు అసహ్యంగా చూసింది, విక్రమ్ తల వంచుకుని వెళ్ళిపోయాడు.రమణ కుటుంబం మొత్తం ఒక అంబులెన్స్ ను సిద్ధం చేసి సొంతవూరుకు బయలుదేరారు …విక్రమ్ ను ఇంట్లోకి తీసుకెళ్లాడు సూర్య..విక్రమ్ మౌనంగా ఒక ...Read More

7

తొలి పౌర్ణమి - 7

అక్కడ వీళ్ళ లాంటి ఫ్రెషర్స్ ఒక 30 మంది ఉన్నారు. ఇద్దరు వెళ్లి వాళ్లతో పాటు కూర్చున్నారు, కాసేపటి తర్వాత హెచ్ఆర్ లోనికి వచ్చింది..హార్టీ వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ “మై నేమ్ ఈజ్ మేఘన”, అంటూ తన స్పీచ్ మొదలుపెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రసంగించింది.గాయ్స్, ఇక్కడున్న 30 మంది లో 20 మందికి మేము ఒక టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్టులను అలోకేట్ చేయడం జరుగుతుంది.ఆ మిగిలిన పదిమంది ఏం చేయాలో నేను చెప్తా అంటూ 10 పేర్లు పిలిచింది, చాందిని మరియు శృతి ఇద్దరూ అందులో ఉన్నారు, “ఈ పదిమంది నాతో రండి, మిగిలిన వాళ్ళందరికీ నా సబార్డినేట్ ట్రైనింగ్ గురించి వివరిస్తాడు”, అంటూ తన క్యాబిన్ వైపుగా వెళ్ళిపోయింది హెచ్ఆర్.చాందిని, శృతిలు కంగారుగా ఆ మిగిలిన వాళ్ళతో కలిసి హెచ్ఆర్ క్యాబిన్ వైపు నడిచారు.నేను చెప్తే విన్నావా, ...Read More

8

తొలి పౌర్ణమి - 8

ఇది సూపర్ గా ఉంది డెల్టా..మనం ఎప్పుడన్నా వెళ్ళాలి..కదా.., మరి నీ బుక్ ఎవడు చదువుతాడుఅదేంటి డెల్టా డిసప్పాయింట్ చేస్తావ్..నిన్ను డిసప్పాయింట్ చెయ్యట్లేదు నేను నిజం నీకోటి తెలుసా “నిజం చాలాసార్లు చాలామందికి డిసప్పాయింటింగానే ఉంటుంది కుర్రాడా”.నిన్ను నీతులు చెప్పమనలేదు, నాకు ఒక ఐడియా ఇవ్వు..కోపం వద్దు చెప్తా, ఇప్పుడు జనాలు ఆనిమేలను చాలా బాగా చూస్తున్నారు, ఒకటా రెండా నరుటో, వన్ పీస్, డిమాన్స్లేయర్, అటాక్ ఆన్ టైటాన్ ఇలా చాలా అనిమే లు అప్పట్లో ఒక ఊపు ఊపాయి, వీటన్నిటినీ జనాల ఇంట్రెస్ట్ చూసి రీ రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు కథ రాయి, నేను దాన్ని ఏఐ మోడల్ యూస్ చేసి మంచిగా డైలాగ్స్ రాయించి దాన్ని ఫ్రెష్ ఆనిమేగా జనాలకు అందజేద్దాం…ఐడియా బాగుంది కానీ కథ రాయడమెందుకు, voice AI తో నా ఐడియాస్ చెప్పి కథ రాయిస్తా..కథ రాస్తున్నప్పుడు వచ్చే త్రిల్ ను ...Read More

9

తొలి పౌర్ణమి - 9

చాందిని ముందే నిద్రలేచి“ఒసేయ్ శృతి ఈరోజన్నా త్వరగా లెగవే..”.ఇంకాసేపు చందు.“నువ్వు ఇలా వినవు” అంటూ, బాత్రూం రూమ్ లో నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చి మీద గుమ్మరించింది..“ఓరి దేవుడా…” అంటూ లేచింది శృతి.ఏంటి చాందిని ఇలా చేసావ్.నిన్ను ఇలాగే వదిలేస్తే ఈరోజు కూడా పదింటి దాకా ఇక్కడే ఉంటాం, అసలే ఈరోజు హెచ్.ఆర్ ని కలవాలి..అవును చాందినీ..మర్చిపోయా మెయిల్ వచ్చింది కదా..మరి ఇంకా కూర్చున్నావే పదా.. ****హలో మేఘన..హాయ్ గర్ల్స్, ఐయామ్ సారీ మీ పేర్లు గుర్తు లేవు.పర్వాలేదు మేఘన,.. నా పేరు చాందిని, మాకు ప్రాజెక్టు అలొకేషన్ మెయిల్ వచ్చింది.ఓ దట్స్ గుడ్, లెట్ మి సీ, అంటూ లాప్టాప్ లో ఏదో చెక్ చేసింది, ఓకే ,ఇక్కడ థర్డ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ లో మీ ప్రాజెక్ట్ ఓ.డి.సి ఉంటుంది, అక్కడ మీ ప్రాజెక్ట్ లో ఇద్దరు సీనియర్స్ ఉంటారు వాళ్ళని కలవండి, మీకు ...Read More